Advertisement
Advertisement
Abn logo
Advertisement

అందాన్ని అసహ్యించుకునే ఆమెను చూస్తే ఎవరైనా హడలెత్తిపోవాల్సిందే... నార్మల్ లుక్ నచ్చదంటున్న వింత మహిళ!

సాధారణంగా అందాన్ని అభరణంగా భావిస్తారు. దీనికి మరింతగా మెరుగులు దిద్దాలని మగువలు ఆశపడుతుంటారు. అయితే చిత్రంగా అందాన్ని అసహ్యించుకునే ఒక మహిళ ఇంటర్నెట్‌లో హల్చల్ చేస్తోంది. ఆమెకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 25 ఏళ్ల షన్నీ వెబ్‌కు మంత్రగత్తె లుక్ అంటే ఎంతో ఇష్టం. తన అందంతో కాకుండా మంత్రగత్తె లుక్‌తో అందరినీ భయపెట్టాలని షన్నీ ప్రయత్నిస్తుంటుంది. మంత్రగత్తె లుక్‌లో ఉన్న ఆమెను చూసినవారంతా భయపడుతుంటారు.

మంత్రగత్తె లుక్ కోసం ఆమె తన శరీరంపై పలు ప్రయోగాలు చేసింది. లెక్కకు మించిన టాటూలు వేయించుకోవడమే కాకుండా, తన అందమైన కళ్లను కూడా భయంకరంగా మార్చుకుంది. అయితే ఇటీవల షన్నీ తన మనసు మార్చుకుని కొత్తగా మేకప్ వేయించుకుంది. ఇందుకోసం తన శరీరంపై ఉన్న టాటూలను మేకప్ ద్వారా కవర్ చేయించుకుంది. కళ్లకు లెన్స్ పెట్టించుకుంది. దీంతో ఆమె సాధారణ అమ్మాయిలా మారింది. అయితే తన లుక్ చూసుకున్న షన్నీకి అది నచ్చలేదు. ఇలా సాధారణంగా కనిపించడం ఆమెకు విచిత్రంగా అనిపించింది. అందరినీ భయపెట్టే లుక్ చాలా బాగుందనిపించింది. మంత్రగత్తె లుక్ మాత్రమే తనకు సరైనదని నిశ్చయించుకుంది. మంత్రగత్తె లుక్ కోసం షన్నీ చాలా కష్టపడింది. శరీరమంతా టాటూలు వేయించుకోవడంతోపాటు చెవులను కుట్టించుకుంది. ఇటీవలే ఒక టీవీషోలో పాల్గొన్న ఆమె సాధారణ రూపంలో కనిపించింది. ఈ సమయంలో ఆమె తన ముఖాన్ని చూసుకుని తానే భయపడింది. అయితే షన్నీ స్నేహితులు సాధారణ లుక్‌తోనే ఉండాలని ఆమెకు సలహాలిస్తున్నారు.


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement