Advertisement
Advertisement
Abn logo
Advertisement

భార్యతో అతనికి విభేదాలు.. ఆమె పుట్టింటికి వెళ్లిందని అతను ఎంత ఘోరానికి పాల్పడ్డాడంటే.. చివరకు..

వారిద్దరికీ నాలుగేళ్ల క్రితం పెళ్లి జరిగింది.. మూడేళ్లు కలిసి కాపురం చేశారు.. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఏడాది క్రితం ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది.. ఎంత నచ్చ చెప్పినా తిరిగి రాలేదు.. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన భర్త ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.. అతని కుటుంబ సభ్యులు ఆమెపై బెదిరింపులకు దిగారు.. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. 


హర్యానాలోని బలియానా గ్రామానికి చెందిన సునీల్ అనే వ్యక్తికి నాలుగేళ్ల క్రితం రజినీతో వివాహమైంది. మూడేళ్ల అనంతరం ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయి ఏడాది పాటు అక్కడే ఉండిపోయింది. సునీల్ ఎంత నచ్చ చెప్పినా రజినీ తిరిగి రాలేదు. దీంతో మనస్థాపానికి గురైన సునీల్ గురువారం ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అతని అంత్యక్రియలు పూర్తయిన అనంతరం మేనల్లుడు నవదీప్.. రజినీకి ఫోన్ చేశాడు. 


తన మామయ్య చావు కారణమైన రజినీని బతకనివ్వనని బెదిరించాడు. తుపాకీతో కాల్చి చంపేస్తానని హెచ్చరించాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నవదీప్‌ను, అతడి తండ్రిని పోలీస్ స్టేషన్‌కు పిలిచి విచారించారు. మామయ్య చావుకు కారణమైందనే కోపంతోనే రజినీని బెదిరించానని, అంతకు మించి ఇంకేమీ లేదని నవదీప్ చెప్పడంతో పోలీసులు హెచ్చరించి వదిలేశారు. 

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement