వేధిస్తున్న యువకుని స్కూటీని కాలువలోకి నెట్టేసిన యువతి.. ఎఫ్‌బీ పోస్టు వైరల్!

ABN , First Publish Date - 2021-08-03T18:02:46+05:30 IST

అసోం రాజధాని గువాహటిలో స్కూటీ నడుపుతున్న...

వేధిస్తున్న యువకుని స్కూటీని కాలువలోకి నెట్టేసిన యువతి.. ఎఫ్‌బీ పోస్టు వైరల్!

గువాహటి: అసోం రాజధాని గువాహటిలో స్కూటీ నడుపుతున్న యువకుడు చిరునామా అడిగే నెపంతో ఒక యువతిని వేధించాడు. దీంతో ఆ యువతి అతని నుంచి స్కూటీని లాక్కొని పక్కనే ఉన్నకాలువలోకి నెట్టేసింది. దీంతో ఆ యువకుడు అక్కడి నుంచి తప్పించుకోలేకపోయాడు. ఈ ఉదంతానికి సంబంధించిన వివరాలను, వీడియోను ఆ యువతి తన ఫేస్‌బుక్ పేజీలో పోస్టు చేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ యువకుడు చిరునామా అడిగే నెపంతో ఆ యువతి ఎదుట స్కూటీని ఆపాడు. తనకు ఆ చిరునామా తెలియదని ఆమె చెప్పింది. దీంతో అతను వేధింపులకు దిగాడు. ఆమె ఎదరుతిరగడంతో ఆ యువకుడు పారిపోయే ప్రయత్నం చేశాడు. అయితే ఆమె వెంటనే అతని స్కూటిని పట్టుకుని పక్కనున్న నాలాలోకి తోసేసింది. ఈ ఘటన చూసిన స్థానికులు అక్కడకు చేరుకుని, ఆ యువకుడిని పోలీసులకు అప్పగించారు. 


Updated Date - 2021-08-03T18:02:46+05:30 IST