Abn logo
Mar 4 2021 @ 17:40PM

‘అక్కడేం లేదు.. అంతా క్లీన్..నాకు విడాకులు కావాల్సిందే..’

మీరట్: బట్టతలను దాచిపెట్టి తనను పెళ్లి చేసుకున్నాడంటూ మండిపడ్డ ఓ భార్య విడాకులు కావాల్సిందేనని పట్టుబట్టింది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఈ విషయం వెలుగు చూసింది. విగ్ పెట్టుకుని పెళ్లిపీటలెక్కి తనను మోసగించాడనేది భర్తపై ఆమె చేస్తున్న ప్రధాన ఆరోపణ. పెళ్లికి మునుపు భర్తకు ఒత్తు జుట్టు ఉందని, పెళ్లి తరువాత అతడి ‘నిజస్వరూపం’ బయటపడిందని పేర్కొంది. బుధవారం నాడు దంపతులకు మ్యారేజ్ కౌన్సిలింగ్ ఇచ్చినా ఎటువంటి ఉపయోగం లేకపోయింది. భర్త బట్టతల కారణంగా తన స్నేహితుల మందు పరువు పోతోందని ఆమె పేర్కొంది. ఎవరెన్ని చెప్పినా వినని ఆమె డైవర్స్ కావాలంటూ పట్టబట్టింది. దీంతో..మరో మారు కౌన్సెలింగ్ రావాలంటూ వారిని పోలీసుల పంపించారు. కాగా.. ఆ జంటకు జనవరి 2020లో వివాహమైంది.  కాగా.. గతేడాది ముంబైకి చెందిన మరో యువతి కూడా ఇదే కారణంతో డైవర్స్ కోరింది.  బట్టతల దాచిపెట్టి తనను మోసగించాడని ఆరోపిస్తూ ఆమె విడాకుల కోసం కోర్టుకెక్కింది. అంతేకాకుండా.. భర్త తనను కట్నం కోసం వేధిస్తున్నాడని కూడా ఫిర్యాదు చేసింది.