పోలీసు ఉద్యోగానికి ఎంపికైన యువతి.. చివరకు ప్రియుడితో కలిసి బంధువుల పెళ్లికి వెళ్లి ఇలా చేస్తుందనుకోలేదు..

ABN , First Publish Date - 2022-02-23T00:28:19+05:30 IST

అనుకున్న లక్ష్యానికి చేరుకునే క్రమంలో అనుకోని తప్పులు చేసి జైలుపాలవుతుంటారు. దీంతో అప్పటిదాకా వారు పడ్డ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంటుంది. తమిళనాడులో ఓ యువతి విషయంలో ఇలాగే జరిగింది...

పోలీసు ఉద్యోగానికి ఎంపికైన యువతి.. చివరకు ప్రియుడితో కలిసి బంధువుల పెళ్లికి వెళ్లి ఇలా చేస్తుందనుకోలేదు..
ప్రతీకాత్మక చిత్రం

లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి కొందరు పగలూ, రాత్రి కష్టపడుతుంటారు. ఈ క్రమంలో కొందరు పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నాన్ని విరమించకుండా చివరకు విజయం సాధిస్తుంటారు. మరికొందరు మధ్యలోనే నీరుగారిపోయి.. ప్రయత్నాలను పక్కన పెట్టేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో కొందరు.. తీరా అనుకున్న లక్ష్యానికి చేరుకునే క్రమంలో అనుకోని తప్పులు చేసి జైలుపాలవుతుంటారు. దీంతో అప్పటిదాకా వారు పడ్డ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంటుంది. తమిళనాడులో ఓ యువతి విషయంలో ఇలాగే జరిగింది. పోలీసు ఉద్యోగానికి ఎంపికైన ఆమె హాయిగా ఉద్యోగం చేసుకోకుండా.. ప్రియుడితో కలిసి చేయరాని పనులు చేసి చివరకు ఊచలు లెక్కిస్తోంది.


తమిళనాడు విల్లుపురం జిల్లా పుదుచ్చేరికి చెందిన శివపుత్రిక అనే యువతికి పోలీసు అవ్వాలనే కోరిక ఉండేది. అందుకోసం గట్టి ప్రయత్నాలు చేసింది. పుదుచ్చేరి పోలీస్‌ శాఖ నిర్వహించిన అన్ని రకాల పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి, ఎట్టకేలకు ఉద్యోగానికి ఎంపికైంది. ఈమె స్థానంలో వేరే ఎవరున్నా బుద్ధిగా ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తారు. అయితే ఈ యువతి మాత్రం ఓ యువకుడి ప్రేమలో పడింది. వీరి ప్రేమను పెద్దలు వ్యతిరేకించడంతో శివపుత్రిక ఒంటరిగా లేడీస్ హాస్టల్లో ఉంటోంది. ఈ క్రమంలో ప్రియుడితో కలిసి జల్సాలకు అలవాటు పడింది. ఈ నెల 18న ప్రియుడితో కలిసి ఓ వివాహానిక హాజరైంది. వారి గది పక్కనే ఉన్న మాధవి అనే మహిళ గదిలోకి వెళ్లి, ఆమె లాకర్‌లోని నగలను చోరీ చేసింది.

వద్దంటున్నా భర్త బలవంతం.. కాళ్లు, చేతులు కట్టేసి మరీ పైశాచిక ప్రవర్తన.. చివరకు ఏం జరిగిందంటే..


వివాహానంతరం గదికి వచ్చి చూసుకున్న బాధితురాలు షాక్ అయింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. బాధితురాలి గది పక్కనే ఉన్న శివపుత్రిక గదిలో తనిఖీ చేయగా కొన్ని నగలు బయటపడ్డాయి. మిగతా నగలను విక్రయించి, ప్రియుడితో కలిసి జల్సాలు చేసినట్లు అంగీకరించింది. దీంతో శివపుత్రిక, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్యోగం చేసుకోకుండా జల్సాలకు అలవాటు పడి జీవితాన్ని నాశనం చేసుకున్న శివపుత్రిక ఉదంతం స్థానికంగా చర్చనీయాంశమైంది.

బంధువుల ఇంటికెళ్లి తిరిగొచ్చిన భార్య.. తాళం తీసి గదిలోకి వెళ్లగానే బెడ్రూంలో అర్ధనగ్నంగా ఓ యువతి శవం.. ట్విస్ట్ ఏంటంటే..

Updated Date - 2022-02-23T00:28:19+05:30 IST