సూపర్ మార్కెట్‌లో కోవిడ్ ఫ్రాంక్... జైలు పాలైన మహిళ!

ABN , First Publish Date - 2021-08-26T16:49:38+05:30 IST

అమెరికాకు చెందిన ఒక మహిళకు విచిత్ర పరిస్థితుల్లో...

సూపర్ మార్కెట్‌లో కోవిడ్ ఫ్రాంక్... జైలు పాలైన మహిళ!

వాషింగ్టన్: అమెరికాకు చెందిన ఒక మహిళకు విచిత్ర పరిస్థితుల్లో రెండేళ్ల జైలు శిక్ష పడింది. ఈ మహిళ ఇటీవల ఒక సూపర్ మార్కెట్‌కు వెళ్లి చీదడంతోపాటు, అక్కడ ఉన్న ఫుడ్ ఐటమ్స్ సమీపంలో ఉమ్మివేసింది. తరువాత తనకు కరోనా పాజిటివ్ ఉందంటూ గట్టిగా అరుస్తూ, అక్కడున్న అందరికీ వినిపించేలా చెప్పింది. కొద్దిసేపటి తరువాత ఇదంతా వేళాకోళానికే చేశానని నవ్వుతూ చెప్పింది. 


37 ఏళ్ల మార్గరిట్ ఎన్ సిర్కో ఇటీవల ఒక సూపర్ మార్కెట్‌కు వెళ్లింది. అలా వెళుతూనే చీదడం మొదలెట్టింది. మత్తులో ఊగిపోతూ... అందరికీ కరోనా వచ్చి చచ్చిపోతారని అరుస్తూ చెప్పింది. ఈ ఉదంతంలో పోలీసులు ఆ మహిళను అరెస్టు చేశారు. తరువాత కోర్టుకు అప్పగించారు. కోర్టు ఆమెకు రెండేళ్ల జైలు శిక్షతో పాటు తరువాత 8 ఏళ్ల ప్రొబెషన్ శిక్ష కూడా విధించింది. దీనికితోడు సూపర్ మార్కెట్ యజమానికి 30 వేల డాలర్ల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. మార్గరిట్ ఆ సూపర్ మార్కెట్‌లో చేసిన హంగామా తరువాత మార్కెట్ యాజమాన్యం 35 వేల డాలర్ల విలువైన ఫుడ్ ఐటమ్స్‌ను బయట పారబోసింది. ఈ ఘటన జరిగిన సమయంలో సూపర్ మార్కెట్ సిబ్బందితో పాటు, వినియోగదారులు ఆందోళనకు లోనయ్యారు. ఈ విషయాన్ని సూపర్ మార్కెట్ యజమాని జోయ్ ఫాస్లా తన ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా తెలిపారు. 

Updated Date - 2021-08-26T16:49:38+05:30 IST