వైరల్: మహిళ చేతి వేళ్లు వాటంతట అవే రంగు మార్చుకుంటాయ్!

ABN , First Publish Date - 2021-04-28T01:13:40+05:30 IST

చేతి వేళ్ల పొడుగులో తేడాలు ఉంటాయి కానీ వాటి రంగులోనూ తేడాలు ఉంటాయని ఎవరూ అనకోరు. కొన్ని వేళ్లు ఒక రంగులో మిగితావి మరో రంగులో ఉండటం బహు అరుదు. కానీ.. అమెరికాకు చెందిన మోనికా అనే మహిళ పరిస్థితి మాత్రం చాలా విభిన్నం.

వైరల్: మహిళ చేతి వేళ్లు వాటంతట అవే రంగు మార్చుకుంటాయ్!

ఇంటర్నెట్ డెస్క్: చేతి వేళ్ల పొడుగులో తేడాలు ఉంటాయి కానీ వాటి రంగులోనూ తేడాలు ఉంటాయని ఎవరూ అనకోరు. కొన్ని వేళ్లు ఒక రంగులో మిగితావి మరో రంగులో ఉండటం బహు అరుదు. కానీ.. అమెరికాకు చెందిన మోనికా అనే మహిళ పరిస్థితి మాత్రం చాలా విభిన్నం. చల్లటి వాతావరణంలో ఎక్కువ సేపు ఉంటే ఆమె చేతి మధ్య, ఉంగరం వేళ్లు తెల్లగా మారిపోతాయి. కాసేపయ్యాక మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటాయి. ఈ విషయాన్ని మోనికా కుమార్తె సోషల్ మీడియాలో తెలిపింది. రంగుమారిన చేతి వేళ్ల ఫొటోను పోస్ట్ చేసింది. ఇది ప్రస్తుతం తెగ వైరల్ అవుతూ నెటిజన్లను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.


మోనికాకు ఉన్న అరుదైన వ్యాధి కారణంగా ఇలా జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధి పేరు రెయినాడ్స్ సిండ్రోమ్. ఈ వ్యాధి ఉన్న వారి చర్మం కింద ఉండే అతి సన్నని రక్తనాళాలు కొన్ని సందర్భాల్లో మరింత సన్నగా మారిపోతాయి. దీని వల్ల రక్తప్రసరణలో అంతరాయం ఏర్పడి ఆ ప్రాంతంలోని చర్మం మొత్తం పాలిపోయినట్టు అవుతుంది. చల్లని వాతావరణం కారణంగా మోనికా చేతివేళ్లలో కూడా ఇదే జరిగి అవి తాత్కాలికంగా రంగు మారుతాయట. సరే.. వైద్యపరమైన కారణాలు ఎలా ఉన్నప్పటికీ ఈ ఫొటో మాత్రం నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. 

Updated Date - 2021-04-28T01:13:40+05:30 IST