జనావాసాల మధ్య సెల్‌టవర్‌ వద్దు

ABN , First Publish Date - 2021-06-14T06:00:13+05:30 IST

ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే సెల్‌ టవర్‌ను జనావాసాల మధ్య ఎలా పెడతారంటూ భారత్‌పేటలోని మహిళలు ఆందోళనకు దిగారు.

జనావాసాల మధ్య సెల్‌టవర్‌ వద్దు
ఆందోళన చేస్తున్న మహిళలకు సర్దిచెబుతున్న అరండల్‌పేట పోలీసులు

భారత్‌పేటలో మహిళల ఆందోళన

గుంటూరు, జూన్‌ 13: ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే సెల్‌ టవర్‌ను జనావాసాల మధ్య ఎలా పెడతారంటూ భారత్‌పేటలోని మహిళలు ఆందోళనకు దిగారు. భారత్‌పేట 8వ లైను ఎక్స్‌టెన్షన్‌లో ఎయిర్‌టెల్‌ కంపెనీ సెల్‌టవర్‌ ఏర్పాటు చేసేందుకు ఆదివారం ప్రతినిధులు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకన్న స్థానిక మహిళలు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకుని వారిని అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న అరండల్‌పేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారికి సర్దిచెప్పేందుకు యత్నించారు. అయితే టవర్‌ నిర్మాణం చేపట్టాల్సిందేనంటూ కంపెనీ ప్రతినిధులు ప్రయత్నిస్తుండటంతో వారు కలెక్టర్‌, మున్సిపల్‌ కమిషనర్‌లకు ఫిర్యాదులు పంపారు. సెల్‌టవర్‌ నిర్మాణాన్ని నిలిపివేయకుంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.

Updated Date - 2021-06-14T06:00:13+05:30 IST