డప్పుల మోతలకు అదిరిపోయే స్టెప్పులు.. వైరల్‌గా మారిన మహిళల డాన్స్ వీడియో

ABN , First Publish Date - 2021-12-11T23:47:36+05:30 IST

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. బంధువులు, సన్నిహితులతో ఓ వివాహ కార్యక్రమం సందడి సందడిగా జరుగుతోంది. మరోవైపు బ్యాండు వాయిద్యాలు మొదలయ్యాయి. ఇంతలో కొందరు యువతులు..

డప్పుల మోతలకు అదిరిపోయే స్టెప్పులు.. వైరల్‌గా మారిన మహిళల డాన్స్ వీడియో

‘‘పెళ్లంటె పందిళ్లు.. సందళ్లు.. తప్పెట్లు.. తాళాలు.. తలంబ్రాలూ’’... అని ఓ సినీ కవి అన్నట్లు.. పెళ్లిళ్లలో సందడి మాటల్లో వర్ణించలేని విధంగా ఉంటుంది. ఆడవారు పెళ్లి పనుల్లో హడావుడిగా ఉంటే.. మరోవైపు మగవారు మాత్రం మందేసి, చిందేసి రచ్చరచ్చ చేస్తుంటారు. మొత్తానికి అంతా కలిసి పెళ్లి వేడుకను జీవితాంతం మధుర జ్ఞాపకంగా గుర్తు పెట్టుకునేలా చేస్తుంటారు. ఏ వివాహ కార్యక్రమంలో అయినా మగవారి హడావుడి ఎక్కువగా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే పెళ్లి వేడుక అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. ఈ పెళ్లిలో మాత్రం కొంతమంది యువతులు, మహిళలు కలిసి అదిరిపోయే స్టెప్పులతో దుమ్ములేపేశారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. బంధువులు, సన్నిహితులతో ఓ వివాహ కార్యక్రమం సందడి సందడిగా జరుగుతోంది. మరోవైపు బ్యాండు వాయిద్యాలు మొదలయ్యాయి. ఇంతలో కొందరు యువతులు, మహిళలు చేతిలో ఖరీదైన మందుబాటిల్ పట్టుకుని ఎంటరయ్యారు. తామేమీ తక్కువ కాదన్నట్లు.. డప్పు మోతలకు లయబద్ధంగా స్టెప్పులేశారు. వీరి స్టెప్పులు.. అక్కడున్న అందరినీ కట్టిపడేశాయి. దీపికా పదుకొనే, సైఫ్ అలీ ఖాన్ నటించిన ‘కాక్‌టెయిల్’ సినిమాలోని పాటకు ఈ మహిళలు కాలు కదపడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఓ వ్యక్తి ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. వావ్.. ఏం స్టెప్పులేస్తున్నారు.. అంటూ నెటిజన్లు చమత్కరిస్తున్నారు.

తల్లి ఒడిలో కూర్చుని హాయిగా ఆడుకుంటున్న రెండేళ్ల చిన్నారి.. ఇంతలోనే సడన్‌గా దూసుకొచ్చిన తూటా.. అసలేం జరిగిందంటే..



Updated Date - 2021-12-11T23:47:36+05:30 IST