భర్త అదృశ్యం.. కుమార్తెను విషమిచ్చి తల్లి ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-09-19T17:30:15+05:30 IST

అప్పుల బాధ భరించలేక కుటుంబంలో నెలకొన్న విషాదంతో ఒక మహిళ తన కుమార్తెను హతమార్చి తానూ ఆత్మహత్య చేసుకుంది. వివరాలిలావున్నాయి. కురాణిపేట జిల్లా వాలాజాపేటకు చెందిన

భర్త అదృశ్యం.. కుమార్తెను విషమిచ్చి తల్లి ఆత్మహత్య

చెన్నై : అప్పుల బాధ భరించలేక కుటుంబంలో నెలకొన్న విషాదంతో ఒక మహిళ తన కుమార్తెను హతమార్చి తానూ ఆత్మహత్య చేసుకుంది. వివరాలిలావున్నాయి. కురాణిపేట జిల్లా వాలాజాపేటకు చెందిన శరవణప్రసాద్‌ కిరాణా దుకాణం నడుపుతున్నాడు. ఆయనకు భార్య పుష్పరాణి (35), కుమార్తె దర్శిని (7) వున్నారు. దర్శిని రాణిపేటలోని ప్రైవేటు పాఠశాలలో 2వ తరగతి చదువుతోంది. శరవణప్రసాద్‌ వ్యాపారం కోసం పలువురి వద్ద సుమారు రూ.20 లక్షల వరకు అప్పు తీసుకున్నాడు. లాక్‌డౌన్‌ కారణంగా దుకాణం తెరవకపోవడంతో అప్పులు, వడ్డీలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. అప్పులు ఇచ్చిన వారి ఒత్తిడి తట్టుకోలేక శరవణప్రసాద్‌ ఈనెల 15వ తేదీన అదృశ్యమయ్యాడు. దీంతో మనస్తాపానికి గురైన పుష్పరాణి తన కుమార్తెకు విషమిచ్చి తానూ తాగింది. వీరిని గమనించిన చుట్టుపక్కల వారు వారిని వెంటనే వేలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్సలు ఫలించక ఉదయం ఇరువురు మృతిచెందారు. ఈ ఘటనపై వాలజా పోలీసులు కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు.

Updated Date - 2020-09-19T17:30:15+05:30 IST