మన్నెంపల్లిలో కాలువ గండి పనులు ప్రారంభం

ABN , First Publish Date - 2020-02-28T11:38:09+05:30 IST

మండలంలోని మన్నెంపల్లి గ్రామంలో ఆదివారం ఆర్దరాత్రి కాలువకు గండి పడింది. అధికారులు స్పందించక పోవడంతో గ్రామస్థులే మరమతులు చేసుకున్నారు. గతంలో గండి పడిన చోటనే బుధవారం కూడా

మన్నెంపల్లిలో కాలువ గండి పనులు ప్రారంభం

తిమ్మాపూర్‌, ఫిబ్రవరి 27: మండలంలోని మన్నెంపల్లి గ్రామంలో ఆదివారం ఆర్దరాత్రి కాలువకు గండి పడింది. అధికారులు స్పందించక పోవడంతో గ్రామస్థులే మరమతులు చేసుకున్నారు. గతంలో గండి పడిన చోటనే బుధవారం కూడా గండి పడి ఇళ్లలోకి నీళ్లు రావడంతో గ్రామాస్థులు ఆందోళన చెందారు. ఎట్టకేలకు అధికారులు స్పందించారు. గురువారం కాలువకు గండి పడిన ప్రదేశాన్ని నీటిపారుదల, మిషన్‌ భగీరథ ఆధికారులు పరిశిలించి యుద్ధప్రతిపదికన పనులు ప్రారంభించారు.  మిడ్‌మానేర్‌ రిజర్వేయర్‌ నుంచి వచ్చే కుడి మెయిన్‌ కెనాల్‌ వద్ద 9.3 కిలోమీటర్‌ వద్ద  మిషన్‌ భగీరథకు చెందిన 1.2 మిటర్‌ డయా పైప్‌ లైన్‌ 2015వ సంవత్సరంలో వేశీమని వరద కాలువ సర్కిల్‌, డివిజన్‌ నం. 3 ఈఈ సర్దర్‌ ఓంకార్‌ సింగ్‌ తెలిపారు.  ట్రయల్‌ రన్‌ నిర్వహించినప్పుడు ఎలాంటి సమస్య తలెత్తలేదన్నారు. ఇప్పుడు కాలువ ద్వారా నీళ్లు వదలడంతో పైపులైన్‌ కింది భాగంలోని మట్టి నీటి తాకిడికి వదులుగా మారి కాలువకు గండి పడిందని తెలిపారు. గండి పడిన ప్రాంతనికి ఇరువైపులా 10 మీటర్ల మేరా సిమెంట్‌, కాంక్రిట్‌తో నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. దీనికి సంబంధించి మిషన్‌ భగీరథ శాఖ వారి సహకారంతో కాంట్రాక్టర్‌ ద్వారా పనులు కూడా ప్రారంబించామన్నారు. రెండు, మూడు రోజుల్లో మరమత్ములు పూర్తి చేసి కాలువ ద్వారా నీటిని తరలిస్తామని తెలిపార.  మన్నెంపల్లి గ్రామంలో కాలువకు గండి పడిన ప్రదేశాన్ని, ఇళ్లను కరీంనగర్‌ ఆర్డీవో ఆనంద్‌కుమార్‌ గురువారం పరీశీలించారు. కాలువకు మరమతులు చేయిస్తున్న అధికారులతో ఆయన మాట్లాడారు. పనులు పకడ్బందీగా చేయాలని ఆదేశించారు.  అక్కడికి చేరుకున్న గ్రామస్థులు కాలువకు గండి పడడంతో తమ ఇళ్లలోకి నీళ్లు వచ్చాయని, నిత్యావసర వస్తువులు, ఎరువుల బస్తాలు తడిసి నష్టపోయామని ఆర్డీవోకు తెలిపారు. దీంతో ఆయన భాదితుల ఇళ్లను పరిశీలించారు. రెవెన్యూ సిబ్బంది తో  విచారణ జరిపించి, నివేదికను తెప్పిచుకొని భాదితులకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ మేడి అంజయ్య, మిషన్‌ భగీరథ ఈఈ త్రినాఽథ్‌, వరద కాలువ డీఈ రవికుమార్‌, జేఈ కిషోర్‌, సైట్‌ ఇంజనీర్‌ శేఖర్‌, ఇతర అధికారులు, ప్రజాప్రతినిదులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Updated Date - 2020-02-28T11:38:09+05:30 IST