Advertisement
Advertisement
Abn logo
Advertisement

కార్మికుడి హఠాన్మరణం

తడ, డిసెంబరు 6 : పరిశ్రమలో పనిచేస్తూ ఒక్కసారిగా కుప్పకూలి ఓ కార్మికుడు మృతి చెందాడు. పోలీసుల వివరాల మేరకు సూళ్లూరుపేటలోని సూళ్లూరుకు చెందిన బంగారు మురళి (35) మాంబట్టు సెజ్‌లోని రీజన్‌ పవర్‌టెక్‌ పరిశ్రమలో కొన్నేళ్లుగా పనిచేస్తున్నాడు. సోమవారం ఉదయం 6 గంటల డ్యూటీకి విధులకు హాజరయ్యాడు. విధుల్లో ఉండగా సుమారు 9 గంటలప్పుడు మురళీ నిలబడినచోటే కుప్పకూలి పోయాడు. దీంతో పక్కన ఉన్న తోటి కార్మికులు అతనిని లేపేందుకు ప్రయత్నించగా లేవలేదు. పరిశ్రమ వర్గాలు వెంటనే అతనిని సూళ్లూరుపేట ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించాయి. అయితే అప్పటికే  కార్మికుడు మృతి చెందినట్లుగా డాక్టర్లు నిర్ధారించారు. దాంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుడికి భార్య, 12 ఏళ్ల  కుమారుడు ఉన్నారు.  నవ్వుతూ విధులకు వెళ్లిన వ్యక్తి ఇలా శవమై రావడంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement