బీడీ పరిశ్రమల ఎదుట కార్మికుల ధర్నా

ABN , First Publish Date - 2020-06-04T10:03:45+05:30 IST

వేతన ఒప్పంద ప్రకారం వేతనాలు చెల్లించాలని బుధవారం చిన్నచింతకుంట మండల కేంద్రంలోని బీడీ

బీడీ పరిశ్రమల ఎదుట కార్మికుల ధర్నా

ఒప్పందం ప్రకారం వేతనాలివ్వాలని డిమాండ్‌

యజమానులు చర్చలు చేయడం లేదని నిరసన


చిన్నచింతుంట, జూన్‌ 3: వేతన ఒప్పంద ప్రకారం వేతనాలు చెల్లించాలని బుధవారం చిన్నచింతకుంట మండల కేంద్రంలోని బీడీ పరిశ్రల ఎదుట తెలంగాణ బీడీ వర్కర్స్‌ యూనియన్‌ ఆద్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్‌టీయూ రాష్ట్ర కార్యదర్శి సూర్యం, నాయకులు దేవదానం, అరుణ్‌కుమార్‌ మాట్లాడారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో కార్మికులు ఆర్థిక భారంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు.


వేతనాల పెంపునకు సంబంధించి డిమాండ్‌ నోటీసులు ఇచ్చినా, యజమానులు చర్చలు జరపటం లేదని అన్నారు. వారంలోపు చర్చలు జరుపకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని తెలిపారు. బీడీ పరిశ్రమల యజమానులు విష్ణువర్ధన్‌రెడ్డి, సోహైల్‌ సేట్‌, సుధాకర్‌రెడ్డి, ఉస్తాద్‌ బీడీ ప్యాక్టరీ మేనేజర్‌ తసూద్‌ త్వరలో చర్చలు చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. కార్యక్రమంలో బీడీ కార్మిక సంఘం ఉమ్మడి జిల్లా నాయకులు వెంకటన్న, కొండన్న, సామెలు, వెంకటేష్‌, గణేష్‌, సీతారాం పాల్గొన్నారు.

Updated Date - 2020-06-04T10:03:45+05:30 IST