ప్రపంచంలోనే అతిపెద్ద త్రివర్ణ పతాకం ఆవిష్కరణ

ABN , First Publish Date - 2021-10-03T22:03:36+05:30 IST

ప్రపంచంలోనే అతిపెద్ద భారత జాతీయ పతాకాన్ని లదాఖ్‌ని లేహ్‌లో ఆవిష్కరించారు. మహాత్మాగాంధీ 152వ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 225 ఫీట్ల పొడవు, 150 ఫీట్ల వెడల్పు కలిగిన ఈ త్రివర్ణ పతాకాన్ని లదాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆర్‌కే మధుర్ ఆవిష్కరించారు..

ప్రపంచంలోనే అతిపెద్ద త్రివర్ణ పతాకం ఆవిష్కరణ

లేహ్: ప్రపంచంలోనే అతిపెద్ద భారత జాతీయ పతాకాన్ని లదాఖ్‌ని లేహ్‌లో ఆవిష్కరించారు. మహాత్మాగాంధీ 152వ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 225 ఫీట్ల పొడవు, 150 ఫీట్ల వెడల్పు కలిగిన ఈ త్రివర్ణ పతాకాన్ని లదాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆర్‌కే మధుర్ ఆవిష్కరించారు. ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్ (కేవీఐసీ) ఇండియా ఈ జెండాను తయారు చేసింది. జెండా బరువు 1,000 ఉంటుందని, పూర్తి ఖద్దర్‌తో తయారు చేసిన ఇది ప్రపంచంలోనే అతిపెద్ద త్రివర్ణ పతాకమని కేవీఐసీ ఇండియా పేర్కొంది. దీని తయారీకి 57 మంది రిటైర్డ్ ఇంజనీర్లు కష్టపడ్డారట.

Updated Date - 2021-10-03T22:03:36+05:30 IST