Abn logo
Aug 1 2021 @ 22:34PM

గ్రామ దేవతలకు పూజలు

కాల్వలో బోనాలను తీసుకెళ్తున్న మహిళలు

దిలావర్‌పూర్‌, ఆగస్టు1: మండలంలోని కాల్వ గ్రామ మహిళలు ఆదివారం గ్రా మ దేవతలకు బోనాలు సమర్పించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ప్రజలు, రైతులు ఇబ్బందులు పడ్డారు. దీనంతటికి అమ్మవారి ఆగ్రహమేనని భావించిన గ్రామస్తులు అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి ఊరంతా కదిలింది. గ్రామ దేవతలను శాంతింపజేసేందుకు బోనాలు సమర్పించారు. దాదాపు 500 మంది మహిళలు బోనం కుండలు నెత్తిన పెట్టుకొని, బాజాభజంత్రీలతో ప్రతీ గ్రామ దే వతకు సల్ల, అంబలి సమర్పించి చల్లగా చూడమని వేడుకున్నారు. కొంత మంది మహిళలు అమ్మవారి పూనకంతో ఊగిపోయారు. కార్యక్రమంలో సర్పంచ్‌ తిరు మల శ్రీనివాస్‌, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
భీమన్న దేవుని పండుగ
సోన్‌: బొప్పారం గ్రామంలో ఆదివారం భీమన్న దేవుని పండుగ నిర్వహించా రు. నాయక్‌పోడ్‌ కులస్తుల ఆధ్వర్యంలో తప్పెట్లు కొడుతూ సోన్‌ గోదావరి నది జలాలను తెచ్చి జలాభిషేకం చేశారు. అనంతరం పూజలు చేసి నైవేద్యాలు సమ ర్పించారు. కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.
భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు
కుంటాల: శ్రావణమాసం సమీపిస్తుండడతో గ్రామదేవతల ఆలయాలు కిటకి టలాడాయి. కుంటాల గజ్జలమ్మతో పాటు మహాలక్ష్మమ్మ, పెద్దమ్మ ఆలయాలకు మహిళలు చేరుకొని నైవేద్యాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
అమ్మవారికి బంగారు ఆభరణాలు..
సారంగాపూర్‌: ఆడెల్లి పోచమ్మ ఆలయంలో మంచిర్యాల్‌ జిల్లా బెల్లంపెల్లికి చెందిన పోతలింగం అనే భక్తుడు 3 తులాల బంగారు ఆభరణాలను అమ్మవారికి అందజేశారు. ఈ సందర్భంగా అతడిని ఆలయ చైర్మన్‌ ఐటీ చందు, ఆలయ ఈవో మల్లేష్‌ సన్మానించారు. దేవాలయంలో ఆదివారం భక్తులు పోచమ్మ తల్లి దీ వించు తల్లి అంటూ మొక్కులను మొక్కారు ఆలయానికి ఉమ్మడి ఆదిలాబాద్‌, ని జామాబాద్‌, మెదక్‌, కరీంనగర్‌ జిల్లాల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి మొక్కులను మొక్కి పెరుగన్నంను నైవేద్యంగా స మర్పించారు. ఆయా గ్రామాల్లో ఆదివారం గ్రామ దేవతలకు పూజలు చేసి నై వేద్యం సమర్పించారు. శ్రావణమాసం మొదలు కావడంతో గ్రామాల్లోని ప్రజలం దరూ సుఖసంతోషాలతో ఉండాలని గ్రామ దేవతలను వేడుకున్నారు.