పొలం గట్టు తీస్తుండగా నిధులు ప్రత్యక్షం...వాటాల్లో వివాదం...చివరకు

ABN , First Publish Date - 2021-12-30T18:19:27+05:30 IST

జిల్లాలో గుప్తనిధుల కలకలం రేగింది. రామన్నపేట మండలం కుంకుడు పాముల గ్రామంలో రైతు పొలం గట్టు తీస్తుండగా నిధులు ప్రత్యక్షమయ్యాయి.

పొలం గట్టు తీస్తుండగా నిధులు ప్రత్యక్షం...వాటాల్లో వివాదం...చివరకు

యాదాద్రి-భువనగిరి: జిల్లాలో గుప్తనిధుల కలకలం రేగింది. రామన్నపేట మండలం కుంకుడు పాముల గ్రామంలో రైతు పొలం గట్టు తీస్తుండగా నిధులు ప్రత్యక్షమయ్యాయి. మట్టి పాత్రలో వెండి ఆభరణాలు, ఇనుప పాత్రలో బంగారు ఆభరణాలు లభ్యమయ్యాయి. అభరణాలపై ఉర్దూ అక్షరాలు ఉండగా, వాటి విలువ కోటి వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కాగా లభ్యమైన నిధులు గట్టు మధ్యలో ఉండడంతో అన్నదమ్ముళ్ల మధ్య వాటాల్లో వివాదాలు తలెత్తాయి. వాటాల పంచాయితీ గ్రామ పెద్ద మనుషుల దగ్గరికి వెళ్లింది. చివరకు విషయం పోలీసులకు తెలియడంతో నిధులను స్వాధీనం చేసుకున్నారు. నిధులు మొత్తాన్ని రెవెన్యూ అధికారులకు అప్పజెప్పారు. 

Updated Date - 2021-12-30T18:19:27+05:30 IST