ప్రశాంతి నిలయంలో ముగిసిన యజ్ఞం

ABN , First Publish Date - 2021-10-17T07:00:39+05:30 IST

దసరా సందర్బంగా ప్రశాంతినిలయంలోని పూర్ణచంద్ర ఆడిటోరియంలో నిర్వహిస్తున్న వేదపురుస సప్తాహజ్ఞాన యజ్ఞం ఘనంగా ము గిసింది.

ప్రశాంతి నిలయంలో ముగిసిన యజ్ఞం

పుట్టపర్తి, అక్టోబరు 16:  దసరా సందర్బంగా ప్రశాంతినిలయంలోని పూర్ణచంద్ర ఆడిటోరియంలో నిర్వహిస్తున్న వేదపురుస సప్తాహజ్ఞాన యజ్ఞం ఘనంగా ము గిసింది. శుక్రవారం సాయి కుల్వంత్‌లో సత్యసాయి మహాసమాధిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. వారం రోజుల పాటు కొనసాగిన యజ్ఞం  పూర్ణహుతితో ముగించారు. 60 సంవత్సరాల క్రితం సత్యసాయి బాబా దసరా సందర్భంగా యజ్ఞాన్ని ప్రారంభించారని నేటికి  60 వసంతాలు పూర్తి అయినట్లు  పండితులు పేర్కొన్నారు. సాయంత్రం సాయి కుల్వంత్‌లో భక్తులు సంగీత గానకచేరి నిర్వహించారు వేలాది మంది భక్తులు సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో మేనేజింగ్‌ ట్రష్టి ఆర్‌జే రత్నాకర్‌, చక్రవర్తి, ప్రసాదరావు, సేవా సంస్థల అద్యక్షులు నిమీష్‌పాండే, చలం పాల్గొన్నారు.


Updated Date - 2021-10-17T07:00:39+05:30 IST