సమావేశంలో మాట్లాడుతున్న యరపతినేని శ్రీనివాసరావు
పిడుగురాళ్ల, జనవరి 20 : పల్నాడు ఉద్యమ స్ఫూర్తిని అన్ని గ్రామాల్లోనూ సభలు, సమావేశాల్లో నిర్వహించటం ద్వారా ప్రజల్లో చైతన్యం నింపి మనపల్నాడు-మన జిల్లాను సాధించు కోవటం ఎంతో అవసరమని గురజాల మాజీ ఎమెల్యే యరపతినేని శ్రీనివాస రావు అన్నారు. బుధవారం వల్లెల గార్డెన్‌లో పల్నాడు జిల్లా సాధనకమిటీ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పల్నాడు ప్రాంతంలోని ప్రతి ఇంటిపై పల్నాడు జెండా, ద్విచక్ర వాహనంపై స్టిక్కర్ వేయటంతో పాటు హలో రింగ్ టోన్‌కు బదులు మన పల్నాడు-మన జిల్లానే రింగ్‌టోన్ ఉపయోగించాలన్నారు. సినీ గేయ రచయిత సాయి కార్తీక్ పాడిన గేయాల్లో పల్నాడు గొప్పతనం, మహిళలు, యువత పాత్రతో చైతన్యం నింపే విధంగా ఉందన్నారు. త్వరలో మరికొన్ని ప్రాంతా ల్లోనూ జేఏసీ సమావేశాలు నిర్వహించి పల్నాడు జిల్లాగా గురజాలను సాధించేందుకు ప్రతి ఒక్కరూ ఉద్యమాన్ని విస్తృతపరిచేలా కార్యచరణ రూపొందించు కోవాల్సిన అవస రం ఉందన్నారు. గుర్రం జాషువా మనవ రాలు సామ్రాజ్యం మాట్లాడుతూ కులవివక్షను రూపుమాపేందుకు జాషువా రచనల ద్వారా అలుపెరగని పోరాటం చేశారని పల్నాడుకు జాషువా కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ గురజాల జిల్లా సాధనకు పూర్తి మద్దతిస్తామని తెలిపారు. సమావేశంలో జేఏసీ కన్వీనర్ కృష్ణాం జనేయులుతో పాటు గుంటుపల్లి నాగేశ్వరరావు, తియ్యగూర యలమందా రెడ్డి, బషీర్ అహ్మద్, వేముల వెంకటరెడ్డి, పులుకూరి కాంతారావు, తంగెళ్ల శ్రీనివాసరావు, వరప్రసాద్, అంకారావు పాల్గొన్నారు.