యారన్‌ సబ్సిడీ అందించాలి

ABN , First Publish Date - 2022-09-13T05:19:21+05:30 IST

సిరిసిల్లలో బతుకమ్మ చీరలను తయారు చేసిన కార్మికులకు రావాల్సిన పది శాతం యారన్‌ సబ్సిడీని అందించాలని ఏఐటీయూసీ, లాల్‌బావుటా చేనేత, పవర్‌లూం కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి పంతం రవి డిమాండ్‌ చేశారు.

యారన్‌ సబ్సిడీ అందించాలి
కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న కార్మిక సంఘం నాయకులు

 సిరిసిల్ల కలెక్టరేట్‌, సెప్టెంబరు 12: సిరిసిల్లలో బతుకమ్మ చీరలను తయారు చేసిన కార్మికులకు రావాల్సిన పది శాతం యారన్‌ సబ్సిడీని అందించాలని ఏఐటీయూసీ, లాల్‌బావుటా చేనేత, పవర్‌లూం కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి పంతం రవి డిమాండ్‌ చేశారు. కలెక్టరేట్‌ ఎదుట ఏఐటీయూసీ లాల్‌బావుటా చేనేత పవర్‌లూం కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు 2019లో తయారు చేసిన బతుకమ్మ చీరలకు రావాల్సిన యారన్‌ సబ్సిడీ 50 శాతం మంది కార్మికులకే అందించారని, మిగతావారికి అందించడంలో అధికారులు విఫలమయ్యారని అన్నారు.  ఏడీ సాగర్‌కు అనేక సార్లు  విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా  కలెక్టర్‌ స్పందించాలని, చేనేత, జౌళి శాఖ అధికారులతో మాట్లాడి డబ్బులను ఇప్పించాలని వినతిపత్రాన్ని అందించారు.   జిల్లా సహాయకార్యదర్శి అజ్జ వేణు, మోర తిరుపతి, సుదర్శన్‌, గణేష్‌, కార్మికులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-13T05:19:21+05:30 IST