సానుభూతి కోసం ఈటల ప్రయత్నిస్తున్నారు

ABN , First Publish Date - 2021-10-17T05:04:06+05:30 IST

ఏ మీటింగ్‌కు వెళ్లినా కరెంటు కట్‌ చేస్తున్నారని, వేధిస్తున్నారని ప్రజల్లో సానుభూతి పొందేందుకు ఈటల రాజేందర్‌ ప్రయత్నిస్తున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు.

సానుభూతి కోసం ఈటల ప్రయత్నిస్తున్నారు
హుజూరాబాద్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి హరీష్‌రావు

- రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు

హుజూరాబాద్‌, అక్టోబరు 16: ఏ మీటింగ్‌కు వెళ్లినా కరెంటు కట్‌ చేస్తున్నారని, వేధిస్తున్నారని ప్రజల్లో సానుభూతి పొందేందుకు ఈటల రాజేందర్‌ ప్రయత్నిస్తున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. శనివారం హుజూరాబాద్‌లోని టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఏడేళ్ల బీజేపీ పాలనకు, టీఆర్‌ఎస్‌ పాలనకు రెఫరెండంగా తీసుకుందామా అని ప్రశ్నించారు. ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ కారు ఓ ఆటో డ్రైవర్‌ను గుద్దిందని చెప్పి జాతీయ రహదారిపై ఎన్నికల కోడ్‌ ఉన్న సమయంలో నిబంధనలకు విరుద్ధంగా ధర్నా చేశాదరని, సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు కారును పట్టుకుంటే అది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సన్నిహితుడి కుమారుడుదని తేలిందన్నారు. గ్యాస్‌ సిలిండర్‌ పన్నుపై చర్చకు రావాలని పిలిచి రెండు రోజులైనా స్పందించడం లేదన్నారు. కమలాపూర్‌ మండలం శంభునిపల్లెలో మహిళలకు వడ్డీ లేని రుణాలకు సంబంధించిన ఫేక్‌ చెక్కులు ఇచ్చారని దుష్ప్రచారం చేస్తున్నారు. పండుగకు ముందే మహిళల ఖాతాల్లో 25.89 కోట్లు జమ చేశామని తెలిపారు. అబద్ధాల పునాదుల మీద చేసే ప్రచారాలను, సోషల్‌ మీడియాలో వచ్చే ఫేక్‌ ప్రచారాలు, కరపత్రాల రూపంలో చేసే విష ప్రచారాన్ని తిప్పి కొట్టాలన్నారు.  బీజేపీని ఈటల ఓన్‌ చేసుకోవడం లేదని, ఆయనను బీజేపీ ఓన్‌ చేసుకోవడం లేదనాఆ్నరు. బీజేపీ ప్రభుత్వ నిర్ణయాలకు తాను దూరం అన్నట్లు, తాను భాగం కానానన్నట్లు మాట్లాడుతున్నారన్నారు. దీనికి నిజమైన బీజేపీ కార్యకర్తలు, ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు బాధపడుతున్నారన్నారు. వినోద్‌కుమార్‌ ఎంపీగా ఉన్నప్పుడు హుజూరాబాద్‌కు రైల్వేలైన్‌ మంజూరు చేయిస్తే దానిని బండి సంజయ్‌ అటకెక్కించారన్నారు. సమావేశంలో ఎంపీ బండ ప్రకాష్‌, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకుడు పాడి కౌశిక్‌రెడ్డి, జమ్మికుంట మన్సిపల్‌ చైర్మన్‌ తక్కళ్లపల్లి రాజేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-17T05:04:06+05:30 IST