దళారులుగా వైసీపీ నాయకులు !

ABN , First Publish Date - 2021-05-17T05:36:57+05:30 IST

ప్రభుత్వం ప్రారంభించిన వరి కొ నుగోలు కేంద్రంలో కొందరు వైసీపీ నాయకులు పైరవీలు చేస్తూ దళారుల అవతారమెత్తారు. అధికారులపై ఒత్తిడి తేవడంతో తట్టుకోలేక సివిల్‌ సప్లై జిల్లా అసిస్టెంట్‌ మేనే జర్‌ అశ్వర్థనాయక్‌ తాత్కాలికంగా కొనుగోళ్లను నిలిపి వేస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు.

దళారులుగా వైసీపీ నాయకులు !
అసిస్టెంట్‌ డీఎంను చుట్టుముట్టిన వైసీపీ నాయకులు, రైతులు

వరి కొనుగోలు కేంద్రంలో హల్‌చల్‌ 

సామాన్య రైతులకు అందని ఖాళీ సంచులు 

ఒత్తిడి తట్టుకోలేక అసిస్టెంట్‌ డీఎం పలాయనం

తాత్కాలికంగా కొనుగోళ్లు నిలిపివేత 


కణేకల్లు, మే 16 : ప్రభుత్వం ప్రారంభించిన వరి కొ నుగోలు కేంద్రంలో కొందరు వైసీపీ నాయకులు పైరవీలు చేస్తూ దళారుల అవతారమెత్తారు.  అధికారులపై ఒత్తిడి తేవడంతో తట్టుకోలేక సివిల్‌ సప్లై జిల్లా అసిస్టెంట్‌ మేనే జర్‌ అశ్వర్థనాయక్‌ తాత్కాలికంగా కొనుగోళ్లను నిలిపి వేస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు. కణేకల్లులో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రంలో వైసీపీ నాయకుల తీరుపై సామాన్య రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


రబీ రైతుల కోసం...

రబీ సీజన్‌లో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొను గోలు చేసేందుకు ప్రభుత్వం కణేకల్లులో కొనుగోలు కేంద్రా న్ని ఏర్పాటు చేసింది. వరి పండించిన రైతులు రైతు భరో సా కేంద్రాల్లో తమ పేర్లు నమోదు చేసుకుని ఆ తరువా త సివిల్‌ సప్లై అధికారిని కలిసి ఖాళీ సంచులు పొంది వరి విక్రయాలు చేయడం సాధారణంగా జరిగే తంతు. కాగా వరి కొనుగోలులో తమకే ప్రాధాన్యత ఇవ్వాలంటూ వైసీపీ నాయకులు గత వారం రోజులుగా సివిల్‌ సప్లై అధికారులపై తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారు. కొందరు భూ స్వాములు అధికారుల వద్ద నుంచి ఖాళీ సంచులు పొంది తమ ఉత్పత్తులను ఇప్పటికే ప్రభుత్వానికి విక్రయించేశా రు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు కొనుగోలు చేస్తున్నప్ప టికీ బహిరంగ మార్కెట్లో కేవలం రూ. 1400 కూడా పల కడం లేదు. ప్రభుత్వం రూ. 1880 ప్రకారం కొనుగోలు చేస్తుండటంతో రైతులు ధాన్యాన్ని విక్రయించడానికి ఎగబ డుతున్నారు.


దళారుల అవతారమెత్తి....

కొంతమంది వైసీపీ నాయకులు దళారుల అవతార మెత్తి తక్కువ ధరకు ధాన్యాన్ని ఇతర చోట్ల కొనుగోలు చేసి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అధిక ధరలకు విక్ర యిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈపరిస్థితుల్లో ఆది వారం కణేకల్లులోని పలు గ్రామాల నుంచి రైతులు ధా న్యం కొనుగోలు చేయాలని కొత్తకొట్టాలలో గల రైతు భరో సా కేంద్రానికి తరలివచ్చారు. సివిల్‌ సప్లై అధికారులు జా బితాలో ఉన్న మాదిరిగా టోకెన్లు అందించి వారికి సీరి యల్‌ ప్రకారం ఖాళీ సంచులు అందించేందుకు సమా యత్తమయ్యారు. కాగా ఇదే సమయంలో పలువురు వైసీపీ నాయకులు జాబితాలో వెనుక ఉన్నప్పటికీ తమకే ముందు సంచులు ఇవ్వాలని  డిమాండ్‌ చేయడంతో సా మాన్య రైతులు వీరి తీరుపై ఎదురుతిరిగారు. తాము జాబితాలో ముందు వరుసలో ఉన్నప్పటికీ అధికారులు వైసీపీ నాయకుల ఒత్తిడి మేరకు వారికే ఖాళీ సంచులు అందిస్తూ వరిని కొనుగోలు చేస్తున్నారని, ఇది ఎంతవరకు సబబు అంటూ అధికారులను అడ్డుకున్నారు. 


కొనుగోలు నిలిపివేత

ఒక్కసారిగా రైతులు అధికారులతో వాగ్వాదానికి దిగి గుమిగూడటంతో ఆందోళనకు గురైన జిల్లా సివిల్‌ సప్లై అసిస్టెంట్‌ మేనేజర్‌ అశ్వర్థనాయక్‌ తీవ్ర ఒత్తిడికి గురై తనకు షుగర్‌ లెవెల్స్‌ పడిపోతున్నాయంటూ ఆందోళన చెందారు. దళారీ వ్యవస్థ అంతమైతే తప్ప సాధారణ రైతుల ధాన్యాన్ని తాము కొనుగోలు చేయలేమని, ఇక్కడి పరిస్థితులు మా రాలంటూ స్వయంగా ఆయన ప్రకటించి కారులో అనంత పురం వెళ్లిపోయారు. దీంతో తాత్కాలింకంగా వరి కొనుగో లు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. వరి కొనుగోలు కేంద్రా లు ఏర్పాటు చేసినప్పటి నుంచి వైసీపీ నాయకులు హల్‌ చల్‌ చేస్తుండటంతో అధికారులు తీవ్ర ఒత్తిడికి గురై ఖాళీ సంచులు ఇవ్వడం లోను, టోకెన్లు ఇవ్వడంలోను సతమత మవుతున్నారు. ప్రతి ఏడాది కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసిన వెంటనే అధికారులు కొంతమంది బడా రైతుల ముసుగులో ఉన్న వైసీపీ నాయకుల ధాన్యాన్ని కొనుగోలు చేసి వారికే ప్రాధాన్యత ఇస్తుండటంతో సాధారణ రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


Updated Date - 2021-05-17T05:36:57+05:30 IST