ప్రభుత్వ సొమ్ముతో వైసీపీ నాయకుల పందేరం

ABN , First Publish Date - 2021-12-06T06:14:51+05:30 IST

మండలంలోని పీసీ ప్యాపిలి తండాలోని అంగనవాడీ కేంద్రం అధికారుల లెక్కల్లోకి రాకుండా పోయింది.

ప్రభుత్వ సొమ్ముతో వైసీపీ నాయకుల పందేరం
సర్పంచ స్వాధీనంలో ఉన్న కూల్చిన గోడ రాళ్లు

అనుమతులు లేకనే అంగనవాడీ కేంద్రం కూల్చివేత

సర్పంచ స్వాధీనంలో రాళ్లు

మిగిలిన సామగ్రి అమ్మేసిన వైసీపీ నాయకుడు

చోద్యం చూస్తున్న అధికారులు


వజ్రకరూరు, డిసెంబరు 5: మండలంలోని పీసీ ప్యాపిలి తండాలోని అంగనవాడీ కేంద్రం అధికారుల లెక్కల్లోకి రాకుండా పోయింది. అధికార పార్టీ నాయకుల చేతికి చిక్కి... ఎలాంటి అనుమతులు లేకుండానే భవనం కూల్చేశారు. చిన్నపాటి మరమ్మతులతో సరిపోయే భవనాన్ని శిథిలావస్థకు చేరిందని నాయకులే తేల్చేశారు. ఇంకేముంది అంగనవాడీ కేంద్రాన్ని కూల్చే శారు. రాళ్లు, బండలు, వాకిళ్లు, సిమెంట్‌ దూలాలను స్థానిక వైసీపీ నాయకులు ఇష్టారాజ్యంగా అమ్ముకున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. కొత్త భ వనానికి నిధులు మంజూరు కాకుండానే నేలమట్టం చేయడంతో... విధిలేక అంగనవాడీ కేంద్రాన్ని ఆర్డీటీ పాఠశాలలో కొనసాగిస్తున్నారు. 


పీసీ ప్యాపిలి తండాలో గిరిజన బాలింతలు, గర్భిణులు, చిన్నపిల్లల కోసం పౌష్టికాహారం అందించడానికి ప్రభుత్వం అంగనవాడీ కేంద్రాన్ని ని ర్వహిస్తోంది. ఇందులో ఎంటీఎఫ్‌ కింద 47 మంది, ప్రీస్కూల్‌ కింద 28 మంది పిల్లలకు పౌష్టికాహారాన్ని అందజేస్తున్నారు. చిన్నపాటి వర్షానికే భ వనం కారుతుందనే నెపంతో అధికారుల అనుమతులు లేకుండా, భవనం మంజూరు కాకుండానే అంగనవాడీ సెంటర్‌నుకూల్చేశారు. రాళ్లను సర్పంచ జ్యోతిబాయి భర్త తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. గ్రామానికే చెందిన వైసీపీ నాయకుడు సుంక్యా నాయక్‌ మొత్తం సామగ్రిని గ్రామంలోని కొందరికి అమ్మేవేశాడని స్థానికులు వాపోతున్నారు. అలా అమ్మిన సామగ్రి ఇప్ప టికీ కళ్లకు కనిపిస్తుందని చెబుతున్నారు. నిబంధనల ప్రకారం పంచాయతీ తీర్మానం చేసి అధికారుల పర్యవేక్షణలో నిర్మాణ సామగ్రికి వేలం పాట ని ర్వహించి విక్రయించాల్సి ఉంటుంది. అధికార బలంతో తామేమి చేసినా జ రుగుతుందని నిబంధనలు తుంగలో తొక్కి వైసీపీ నాయకులు ఇష్టారాజ్యం గా వ్యవహరించారని ఆరోపిస్తున్నారు.


ఆర్డీటీ పాఠశాలలో అంగనవాడీ సెంటర్‌ 

ఉన్న భవనాన్ని కూల్చేయడంతో స్థానిక ఆర్డీటీ పాఠశాలలోని ప్రాంగణంలోనే ప్రస్తుతం అంగనవాడీ సెంటర్‌ను నిర్వహిస్తున్నారు. దీనికి కూడా కొందరు అడ్డు తగులుతున్నట్లు కార్యకర్త లక్ష్మిబాయి వాపోయింది. ఇంత జ రుగుతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారు. ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండానే భవనాన్ని కూల్చేసి, సామగ్రి అము్ముకున్న వారిపై ఎ టువంటి చర్యలు తీసుకోకుండా అధికారులు వంతపాడుతున్నారన్న విమర్శ లున్నాయి. అధికారం అండగా ఉంటే ఏమైౖనా చేస్తారా? అంటూ గ్రామస్థులు మండిపడుతున్నారు. 


Updated Date - 2021-12-06T06:14:51+05:30 IST