యడియూరప్ప ఔట్‌

ABN , First Publish Date - 2021-07-23T07:20:56+05:30 IST

సీఎం మార్పుపై ఇన్నాళ్లుగా గుంభనంగా నెట్టుకొచ్చిన సీఎం యడియూరప్ప,

యడియూరప్ప ఔట్‌

  • రేసులో ప్రహ్లాద్‌ జోషి, రవి, మురుగేశ్‌
  • తన నిష్క్రమణను ధ్రువీకరించిన యడ్డీ
  • అధిష్ఠానం చెప్పినట్టు చేస్తానని వెల్లడి
  • 26న రెండేళ్ల పాలన సభ 
  • అదేరోజు గవర్నర్‌కు రాజీనామా!
  • కర్ణాటక సీఎం రేసులో నేతలెందరో..
  • ప్రహ్లాద్‌, రవికి ఆరెస్సెస్‌ ఆశీస్సులు
  • ‘సామాజిక’ంగా మురుగేశ్‌కు చాన్స్‌!


బెంగళూరు, జూలై 22(ఆంధ్రజ్యోతి): సీఎం మార్పుపై  ఇన్నాళ్లుగా గుంభనంగా నెట్టుకొచ్చిన సీఎం యడియూరప్ప, ఎట్టకేలకు బయటపడిపోయారు. గురువారం బెంగళూరు విధానసౌధ వద్ద మీడియాతో మాట్లాడుతూ తొలిసారి తన నిష్క్రమణను ధ్రువీకరించారు.


‘‘ఈనెల 26న రెండేళ్ల పాలనపై సాధన సమావేశం నిర్వహిస్తాం. ఆపై అధిష్ఠానం సూచించినట్లుగా నడుచుకుంటాను. 75 ఏళ్లు పైబడిన వారికి కీలక పదవులలో కొనసాగించే సంప్రదాయం బీజేపీలో లేదు. అయితే, నాకోసం రెండేళ్లపాటు పెద్దలు వెసులుబాటు ఇచ్చారు. దీని పై ఎవరూ ఆందోళనలు చేయొద్దు’’ అని యడ్డీ పేర్కొన్నారు.


కొన్ని నెలలుగా సీఎం మార్పుపై నెలకొన్న సందిగ్ధతకు స్వయంగా ఆయనే తెర దించా రు. బీజేపీ వర్గాల సమాచారం మేరకు వచ్చే సోమవారం రెండేళ్ల పాలనపై సభ కాగానే.. యడ్డీ రాజభవన్‌కు నేరుగా వెళ్లి గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌ను కలిసి రాజీనామా లేఖ సమర్పిస్తారు. 


కాగా, సీఎం రేసులో డజను మందికి పైగా నే పేర్లు వినిపిస్తున్నాయి. కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి, బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి సీటీ రవితో పాటు రాష్ట్ర మంత్రులు మురుగేశ్‌ నిరాణి, ఉపముఖ్యమంత్రి సీఎన్‌ అశ్వత్థనారాయణ పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. లింగాయత సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇవ్వదలచుకుంటే మురుగేశ్‌ నిరాణికి చాన్స్‌ ఇస్తారని చెబుతున్నారు. ఆర్‌ఎ్‌సఎస్‌ వర్గా లు ప్రహ్లాద్‌ జోషి లేక సీటీ రవిలో ఒకరిని సీఎం చేయాలని పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. 


Updated Date - 2021-07-23T07:20:56+05:30 IST