Telangana: ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఆరు గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2021-09-04T14:27:49+05:30 IST

జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌లో వరద ప్రవాహం కొనసాగుతోంది.

Telangana: ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఆరు గేట్లు ఎత్తివేత

మంచిర్యాల: జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌లో వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ ఆరు గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 47814 క్యూసెక్కులు,  అవుట్ ఫ్లో 32370 క్యూసెక్కులుగా ఉంది. అలాగే పూర్తి సామర్థ్యం  20.175 టీఎంసీలుకాగా.. ప్రస్తుత నీటి నిల్వ  19.0362 టీఎంసీలుగా కొనసాగుతోంది. 

Updated Date - 2021-09-04T14:27:49+05:30 IST