ఇంజినీరింగ్‌, పాలిటెక్నిక్ కాలేజీల్లో ఈ ఏడాది పీజు పెంపు లేదు

ABN , First Publish Date - 2021-06-16T11:18:40+05:30 IST

కరోనా వల్ల తలెత్తిన పరిస్థితుల దృష్ట్యా...

ఇంజినీరింగ్‌, పాలిటెక్నిక్ కాలేజీల్లో ఈ ఏడాది పీజు పెంపు లేదు

లక్నో: కరోనా వల్ల తలెత్తిన పరిస్థితుల దృష్ట్యా ఈ ఏడాది యూపీలోని ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలల్లో ఫీజులు పెంచకూడ‌ద‌ని యోగి ప్రభుత్వం కీల‌క‌ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్  ఆధ్వ‌ర్యంలో నడుస్తున్న క‌ళాశాల‌ల్లో నిర్వ‌హిస్తున్న కోర్సుల‌లో గత సంవత్సరం నిర్ణ‌యించిన‌ ఫీజులనే కొన‌సాగించాల‌ని యూపీ ప్రభుత్వం భావించింది. యూపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కార‌ణంగా రాష్ట్రంలోని కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్‌కు అనుబంధంగా ఉన్న క‌ళాశాల‌ల్లో చ‌దువుకుంటున్న విద్యార్థుల‌కు ప్ర‌యోజ‌నం చేకూర‌నుంది. ఇదేవిధంగా కొత్త అకాడ‌మిక్‌ ఇయ‌ర్‌లో స్కూళ్ల‌లో కూడా ఫీజు పెంచ‌కూడ‌ని యూపీ ప్ర‌భుత్వం ఆదేశించింది. లాక్‌డౌన్, కరోనా కర్ఫ్యూ మధ్య ప్రజలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకుంది.

Updated Date - 2021-06-16T11:18:40+05:30 IST