కుటుంబాన్ని రక్షించుకునే కథానాయకురాలు మీరే!

ABN , First Publish Date - 2020-04-05T11:12:40+05:30 IST

మీ కు టుంబ సభ్యులను కాపాడుకునే కథానాయ కురాలు మీరే కావాలని నిజామాబాద్‌ జిల్లా

కుటుంబాన్ని రక్షించుకునే కథానాయకురాలు మీరే!

మీ కుటుంబ సభ్యులు 15 రోజులు ఇంట్లోనే ఉండేలా చూసే బాధ్యత మీదే

లేదంటే వృద్ధులు, పిల్లలకు ప్రమాదం

లక్షణాలు లేకున్నా.. యువతకు కరోనా పాజిటివ్‌ వచ్చే అవకాశం ఉంది..

చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నా.. మీ కుటుంబాన్ని మీరే సంరక్షించుకోండి

జిల్లా మహిళలకు కలెక్టర్‌ నారాయణరెడ్డి వీడియో సందేశం


నిజామాబాద్‌ అర్బన్‌,  ఏప్రిల్‌ 4: మీ కు టుంబ సభ్యులను కాపాడుకునే కథానాయ కురాలు మీరే కావాలని నిజామాబాద్‌  జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి మహిళలకు వీడియో ద్వారా చేతులెత్తి విజ్ఞప్తి చేశారు. జిల్లాలో మొన్నటి వరకు 2, నిన్న 16, ఈరోజు ఒకటి మొత్తం 19 కేసులు పాజిటివ్‌ వచ్చాయని తె లిపారు. వీరిలో కొందరు యువకులు కూడా ఉన్నారని, వీరిలో కరోనా లక్షణాలు లేనప్పటి కీ వారి రిపోర్టులు పాజిటివ్‌గా వచ్చాయని వివరించారు. తమకు కరోనా లేదని విచ్చల విడిగా బయట తిరగడం కారణంగా ఎక్కడి నుంచో అది సంక్రమిస్తే దానితో వారు ఇంటి కి వచ్చి కుటుంబసభ్యులు, వృద్ధులు, పిల్లల కు అంటించిన వారవుతారన్నారు. ఈ విష యంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కుటుంబ సభ్యులు తప్పనిసరి అయి తే తప్పా బయటకు వెళ్లకుండా క్రమశిక్షణ పాటించే విధంగా చూసే బాధ్యత  ఇంటిపె ద్ద, మహిళలదేనన్నారు. లేకుంటే ఇంట్లో దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి చా లా త్వరగా వైరస్‌ సంక్రమించే ప్రమాద ముంటుందనే విషయాన్ని గ్రహించాలన్నా రు.


వీరికి సంబంధించిన ప్రైమరీ కాంటాక్ట్స్‌ సభ్యులను ప్రభుత్వ క్వారంటైన్‌లో ఉంచి పరీక్షిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా విదేశాల నుంచి వచ్చిన 3,763 మందిని ఇం టి వద్దనే వేరుగా ఉంచడం జరిగిందన్నారు. పాజిటివ్‌ కేసులు వచ్చిన వ్యక్తులున్న ఏరి యాల్లో  ప్రత్యేకంగా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు.  వీరిద్వారా ప్రైమ రీ కాంటాక్ట్‌లు 160 నుంచి 170 మంది, సెకండరీ కాంటాక్ట్‌ సుమారు 500 మంది వీరితో కలిసే అవకాశం ఉంటుందన్నారు. వీరికి కూడా ఒక వేళ వైరస్‌ సోకితే మొత్తం కమ్యూనిటీకి విస్తరించే పరిస్థితి ఏర్పడుతుం దన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఎట్టి పరిస్థితుల్లో బయటకు రాకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. మీ కుటుంబాలను మీరే ఈ వైరస్‌ బారి నుంచి కాపాడుకోవాలంటూ చేతులెత్తి నమస్కరిస్తున్నానని కలెక్టర్‌  నారాయణరెడ్డి ప్రత్యేక వీడియో సందేశం ద్వారా మహిళలను కోరారు.

Updated Date - 2020-04-05T11:12:40+05:30 IST