మీరు సరికొత్త చరిత్ర సృష్టించారు: రైతులపై సింగర్ ప్రశంసల జల్లు

ABN , First Publish Date - 2020-12-06T01:55:15+05:30 IST

కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రైతులు చేస్తున్న ఆందోళనపై పంజాబ్ గాయకుడు,

మీరు సరికొత్త చరిత్ర సృష్టించారు: రైతులపై సింగర్ ప్రశంసల జల్లు

న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రైతులు చేస్తున్న ఆందోళనపై పంజాబ్ గాయకుడు, నటుడు దిల్జీత్ దోసంజ్ ప్రశంసలు కురిపించాడు. శనివారం ఢిల్లీ-హర్యానా (సింఘు) సరిహద్దులో రైతుల ఆందోళలో పాల్గొన్న దిల్జీత్ అనంతరం మాట్లాడుతూ.. కేంద్రానికి తాము ఒకే ఒక్క విజ్ఞప్తి చేస్తున్నామని, రైతుల డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.


సమస్యల నుంచి వారిని పక్కదారి పట్టించొద్దని విజ్ఞప్తి చేశాడు. రైతులందరూ ప్రశాంతంగా ఆందోళన తెలుపుతున్నారని, హింసకు తావే లేదని తేల్చి చెప్పాడు. అనంతరం రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘మీ అందరికీ హ్యాట్సాప్. రైతులు సరికొత్త చరిత్ర సృష్టించారు. భావి తరాలు కూడా ఈ చరిత్రను చెప్పుకుంటాయి’’ అని ప్రశంసించాడు. రైతులకు సంబంధం లేని ఎటువంటి చర్చ ఉండదని, రైతులు ఏమైతే కోరుకుంటున్నారో, ప్రభుత్వం దానిని అంగీకరించాల్సిందేనని తేల్చి చెప్పాడు. 


ఓవైపు గడ్డకట్టించే చలి, మరోవైపు పోలీసులు అడ్డుకుంటున్నా ఏమాత్రం వెరవక ‘ఢిల్లీ చలో’ ఆందోళన కొనసాగిస్తున్నారంటూ రైతులను దిల్జీత్ కొనియాడు. తానిక్కడికి వినడానికే వచ్చాను తప్పితే మాట్లాడేందుకు రాలేదన్నాడు. సరికొత్త చరిత్ర సృష్టించిన పంజాబ్, హర్యానా రైతులకు మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నాడు.  


Updated Date - 2020-12-06T01:55:15+05:30 IST