ప్రభుత్వ భూములను అమ్మె హక్కు నీకెక్కడిది

ABN , First Publish Date - 2021-10-15T06:44:31+05:30 IST

ప్రభుత్వ భూములను అమ్మె హక్కు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎక్కడిదని మాజీ ఎంపీ, బీజేపీ నేత చాడ సురేష్‌రెడ్డి అన్నారు.

ప్రభుత్వ భూములను అమ్మె హక్కు నీకెక్కడిది
ఇల్లందకుంటలో విలేకరులతో మాట్లాడుతున్న మాజీ ఎంపీ చాడ సురేష్‌రెడ్డి

 మాజీ ఎంపీ చాడ సురేష్‌రెడ్డి

ఇల్లందకుంట, అక్టోబరు 14: ప్రభుత్వ భూములను అమ్మె హక్కు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎక్కడిదని మాజీ ఎంపీ, బీజేపీ నేత చాడ సురేష్‌రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు భూమి లేని నిరుపేదలకు ఎక్స్‌ఎల్‌ పట్టా ఇచ్చారని, కానీ వాటిని అమ్ముకునే హక్కు ఉండదని, అలాంటిది ప్రభుత్వ భూములను సీఎం కేసీఆర్‌కు అమ్మె నైతిక హక్కు లేదని మండిపడ్డారు. మెడికల్‌ షాపుల మాదిరిగా వైన్‌ షాపులలో కూడా బిల్లులు ఇవ్వాలన్నారు. మద్యం రేట్లు విపరీతంగా పెంచడం వల్ల మధ్య తరగతి కుటింబికులపై భారం పడుతుందన్నారు. వైన్‌ షాపుల నుంచి ప్రతి నెల ఎక్సైజ్‌ శాఖ అధికారులు మాముళ్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. దేశ వ్యాప్తంగా చూసినట్లుయితే కేవలం తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలను తాగుబోతులను తయారు చేసిన ప్రభుత్వం టీఆర్‌ఎస్‌ పార్టీ అన్నారు. ప్రజలను పక్కదారి పట్టించేందుకు మాత్రమే గ్యాస్‌ ధరలపైఔ మంత్రి హరీష్‌రావు మాట్లాడుతున్నాడని, కేంద్రం నుంచి గ్యాస్‌ రూ. 560ఉంటే టీఎస్టీ రూపకముగా రూ. 291 రాష్ట్ర ప్రభుత్వం పన్ను వేస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఉజ్వల పథకం ద్వారా ప్రతి నిరుపేద కుటుంబానికి ఉచితంగా గ్యాస్‌ కనెక్షన్‌ ఇచ్చామని, అదేవిధంగా గ్రామాల్లో చేపడుతున్న అంతర్గత రోడ్లు, వైకుంఠదామాలు, ఉపాధి హామీ పనులు, హరితహారం, పల్లె ప్రకృతి వనాలు, రైతువేదికలు (27) రకాల పథకాలతోనే రాష్ట్ర ప్రభుత్వం పనులు చేస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలోని ప్రభుత్వ భూముల లెక్కలు చూశాడని, పోరపాటున హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ గెలిస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములను అమ్మడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం విచ్చలవిడిగా మద్యం, డబ్బు పంపిణీ చేస్తున్నట్లు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదన్నారు. త్వరలో ఈసీకి ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మండలాధ్యక్షుడు తిరుపతిరెడ్డి, నాయకులు రాంచందర్‌రావు, కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, సాయిరెడ్డి, కొత్త శ్రీనివాస్‌, సురేందర్‌రెడ్డి, దేవేందర్‌రెడ్డి, సధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-15T06:44:31+05:30 IST