13లోపు యుడైస్‌ వివరాలు నమోదు చేయాలి

ABN , First Publish Date - 2020-07-06T10:31:37+05:30 IST

ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేటు పాఠశాలల్లో విద్యా వివరాలను యుడైస్‌ పోర్టల్‌లో ఈనెల 13వ తేదీ లోపు..

13లోపు యుడైస్‌ వివరాలు నమోదు చేయాలి

ఒంగోలువిద్య, జూలై 5 : ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేటు పాఠశాలల్లో విద్యా వివరాలను యుడైస్‌ పోర్టల్‌లో ఈనెల 13వ తేదీ లోపు నమోదు చే యాలని పాఠశాల విద్య కమిషనర్‌ వి.చినవీరభద్రుడు ఉత్తర్వులు జారీ చే శారు. యుడైస్‌ నమోదులో దొర్లిన తప్పులను పోర్టల్‌ నుంచి తొలగించాలని ఆదేశించారు. ఉపాధ్యాయుల వివరాలు నమోదు చేయని స్కూళ్లలో పని సర్దుబాటు కింద నమోదు చేయాలని, ప్రత్యేక అవపరాలు గల పిల్లలను త క్షణమే పొందుపర్చాలని సూచించారు. దృష్టిలోపంతో బాధపడుతున్న వి ద్యార్థులతోపాటు భవిత కేంద్రాల్లో సేవలు పొందుతున్న వారి పేర్లు కూడా తప్పనిసరిగా నమోదు చేయాలిలన్నారు. ఆయా అంశాలపై సందేహాలను  నివృత్తి చేసేందుకు ఒంగోలులోని సమగ్రశిక్ష కార్యాలయంలో ప్రత్యేకంగా హెల్ప్‌డస్క్‌ ఏర్పాటు చేసి జిల్లా ఎంఐఎస్‌ కోఆర్డినేటర్‌కు బాధ్యతలు అప్ప గించాలని కమిషనర్‌ ఆదేశించారు. 

Updated Date - 2020-07-06T10:31:37+05:30 IST