Viral Video: పెయింట్‌తో ఇతడు చేసిన మ్యాజిక్ చూస్తే.. ఆశ్చర్యపోవడం మాత్రం ఖాయం..

ABN , First Publish Date - 2021-12-04T02:48:18+05:30 IST

చాలా మందికి పెయింటింగ్ అంటే సరదా. కొందరైతే పెయింట్‌తో అద్భుతాలు చేయడం చూస్తుంటాం. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి లారీ ట్యాంక్‌కు పెయింట్‌తో ఏవేవో గీతలు గీస్తాడు. మొదట..

Viral Video: పెయింట్‌తో ఇతడు చేసిన మ్యాజిక్ చూస్తే.. ఆశ్చర్యపోవడం మాత్రం ఖాయం..

ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ ఉంటుంది. కొందరు తమ టాలెంట్‌కు పదును పెట్టి.. అందరితోనూ శభాష్ అనిపించుకుంటూ ఉంటారు. ఇంకొందరైతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ తమలో ఉన్న టాలెంట్‌ను కూడా గుర్తించలేని స్థితిలో ఉంటారు. టాలెంట్ కలిగిన వాళ్లు చాలా మంది ఉన్నా.. చాలా తక్కువ మంది మాత్రమే వెలుగులోకి వస్తుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమా అని.. గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు కూడా బయటి ప్రపంచానికి తెలుస్తున్నారు. కాస్త విభిన్నమైన పనులు చేసే వారైతే.. ఇట్టే సెలబ్రిటీలు అయిపోతుంటారు.


చాలా మందికి పెయింటింగ్ అంటే సరదా. కొందరైతే పెయింట్‌తో అద్భుతాలు చేయడం చూస్తుంటాం. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి లారీ ట్యాంక్‌కు పెయింట్‌తో ఏవేవో గీతలు గీస్తాడు. మొదట ఏం చేస్తున్నాడో అర్థం కాదు. అయితే పెయింటింగ్ మొత్తం పూర్తయ్యాక చూస్తే.. డీజిల్ అనే అక్షరాలు కనిపించడం.. ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇది మంత్రమూ కాదు, మాయ అంతకంటే కాదు. కేవలం అతడి టాలెంట్ అని మాత్రం చెప్పవచ్చు. ఇతడి టాలెంట్‌కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. శభాష్.. అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.



Updated Date - 2021-12-04T02:48:18+05:30 IST