ప్రియుడితో ఉన్న కూతురిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న తల్లి.. 18ఏళ్లు నిండగానే పెళ్లి చేసుకుంటానని యువకుడు చెప్పడంతో.. చివరకు...

ABN , First Publish Date - 2022-07-09T22:16:13+05:30 IST

కొందరు పెళ్లి పేరుతో యువతులను నమ్మించి.. చివరకు మోసం చేస్తుంటారు. వారి దారుణాలను పసిగట్టలేని మహిళలు గుడ్డిగా నమ్మేస్తుంటారు. చివరకు మోసపోయామని తెలుసుకుంటారు...

ప్రియుడితో ఉన్న కూతురిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న తల్లి.. 18ఏళ్లు నిండగానే పెళ్లి చేసుకుంటానని యువకుడు చెప్పడంతో.. చివరకు...
ప్రతీకాత్మక చిత్రం

కొందరు పెళ్లి పేరుతో యువతులను నమ్మించి.. చివరకు మోసం చేస్తుంటారు. వారి దారుణాలను పసిగట్టలేని మహిళలు గుడ్డిగా నమ్మేస్తుంటారు. చివరకు మోసపోయామని తెలుసుకుంటారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయి ఉంటుంది. ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ మహిళ.. ప్రియుడితో ఉన్న తన కూతురిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. అయితే 18ఏళ్లు నిండగానే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో అర్థం చేసుకుంది. పోలీసు ఉద్యోగం రావడంతో యువకుడు చివరకు మాట మార్చాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..


ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం కాన్పూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న బతుక్‌ధర్ ద్వివేది అనే వ్యక్తికి రెండేళ్ల క్రితం ఓ బాలిక పరిచయమైంది. కొన్నాళ్లకు ఆ పరిచయం కాస్తా.. ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో బాలిక కూడా అతన్ని నమ్మింది. కుటుంబ సభ్యులకు తెలీకుండా ఇద్దరూ రోజూ కలుసుకునేవారు. ఈ క్రమంలో యువకుడు పోలీసు ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసేవాడు. ఉద్యోగం రాగానే పెళ్లి చేసుకుంటానని చెప్పి... బాలికను చిత్రకూట్‌ అనే ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.

లిఫ్ట్ ఇస్తానంటూ ఆటోలో ఎక్కించుకున్నాడు.. వారం రోజుల పాటు గదిలో బంధించి మరీ దారుణం.. ప్రస్తుతం అతడి పరిస్థితి..


అయితే ఈ క్రమంలో బాలిక తల్లి.. వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. బాలికకు 18 ఏళ్లు నిండగానే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో అంతా నమ్మారు. ఈ క్రమంలో అతడికి పోలీసు ఉద్యోగం కూడా వచ్చింది. అయితే ఇటీవల బాలిక గర్భం దాల్చింది. దీంతో పెళ్లి చేసుకోమని యువకుడిని నిలదీయడంతో చివరకు మాట మార్చాడు. అంతటితో ఆగకుండా బయట చెబితే.. నీ నగ్న వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బెదిరించాడు. దీంతో బాధితురాలు చివరకు పోలీసు కమిషనర్‌ను ఆశ్రయించింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

వైద్యం చేసే క్రమంలో ఆమెతో పరిచయం.. తీరా పెళ్లి చేసుకుంటుండగా మంటపంలో ఊహించని twist.. చివరకు ఏమైందంటే..

Updated Date - 2022-07-09T22:16:13+05:30 IST