Abn logo
Oct 18 2021 @ 01:10AM

విద్యుదాఘాతంతో యువకుడి మృతి

తబ్రేజ్‌ మృతదేహం

తిరుపతి(నేరవిభాగం), అక్టోబరు 17: విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతి చెందిన ఘటన తిరుపతిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈస్ట్‌ ఎస్‌ఐ ప్రకాష్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. షేక్‌ తబ్రేజ్‌ (35) స్థానిక అబ్బన్న కాలనీలో ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నాడు. శనివారం సాయంత్రం నగరంలో కురిసిన భారీ వర్షం కారణంగా కరెంటు పోతూ ఉంది. దాంతో దుకాణంలో విద్యుత్‌ సరఫరాకు సంబంధించిన మెయిన్‌ను ఆపేశాడు. వర్షం తగ్గాక కరెంట్‌ రావడంతో మెయిన్‌ ఆన్‌చేసి, గ్యాస్‌ సిలిండర్‌ను సర్దుబాటు చేయబోతుండగా ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. అక్కడే ఉన్న కుటుంబీకులు ఆయన్ను 108లో రుయాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అదేరోజు రాత్రి మరణించాడు. వర్షం కురిసిన కారణంగా కరెంటు వైర్లనుంచి గ్యాస్‌ సిలిండర్‌కు విద్యుత్‌ సరఫరా కావడంతోనే తబ్రేజ్‌ విద్యుదాఘాతానికి గురైనట్టు భావిస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.