Advertisement
Advertisement
Abn logo
Advertisement

అర్ధరాత్రి ప్రేయసి ఇంట్లోకి ప్రవేశించి ఆమె తల్లిదండ్రులకు దొరికిపోయాడు.. అయినా ఎవరూ చేయని పని చేశాడు!

ప్రియురాలిని చూడాలనిపించి అర్ధరాత్రి ఆమె ఇంటికి వెళ్లాడు.. అప్పటికి ఆమె తండ్రి మెళకువగానే ఉండడంతో అతని కంట్లో పడ్డాడు.. అక్కడి నుంచి మెల్లగా జారుకోకుండా అతనితోనే గొడవకు దిగాడు.. అనంతరం స్నేహితులను తీసుకెళ్లి ప్రేయసి తండ్రిని చితక్కొట్టాడు.. అడ్డువచ్చిన అతడి కొడుకుపై కూడా దాడి చేశాడు.. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.. మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. 


సాగర్ జిల్లాలోని మోతినగర్ గ్రామానికి చెందిన హరిఓమ్ అనే యువకుడు తమ కాలనీకే చెందిన 17 ఏళ్ల బాలికతో రెండేళ్లుగా ప్రేమాయణం సాగిస్తున్నాడు. వీరిద్దరూ తరచుగా ఆమె ఇంట్లోనే కలుసుకునేవారు. బుధవారం రాత్రి కూడా హరిఓమ్ ఎప్పటిలాగానే ప్రేయసి ఇంట్లోకి ప్రవేశించాడు. అప్పటికి ఆ యువతి తండ్రి నిద్రపోలేదు. తన కూతురి గదిలోకి వెళ్తున్న హరిఓమ్‌ను అడ్డుకున్నాడు. దీంతో ఆగ్రహించిన హరిఓమ్ అతనితో గొడవపడిబయటకు వెళ్లిపోయాడు. కొద్దిసేపటి తర్వాత స్నేహితులను తీసుకెళ్లి ప్రేయసి తండ్రిపై దాడి చేశాడు. 


అతడిని కాపాడేందుకు అతడి భార్య, కొడుకు కూడా వచ్చారు. వారిపై కూడా హరిఓమ్, అతని స్నేహితులు దాడి చేశారు. ఈ దాడిలో ప్రేయసి తండ్రి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స అందుకుంటున్నాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మొత్తం ముగ్గురు యువకులపై కేసులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు. 

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement