దండలు మార్చుకున్న వధూవరులు.. అనంతరం స్నేహితులంతా కలిసి వధువును ఓ గదికి తీసుకెళ్లగా... మరుక్షణమే ఊహించని ఘటన...

ABN , First Publish Date - 2022-04-29T15:45:42+05:30 IST

అది ఓ వివాహ కార్యక్రమం. బంధువులు, స్నేహితులు, సన్నిహితులతో మండపం కళకళలాడుతూ ఉంది. ఇంతలో ముహూర్త సమయం రానే వచ్చింది. బంధువులంతా...

దండలు మార్చుకున్న వధూవరులు.. అనంతరం స్నేహితులంతా కలిసి వధువును ఓ గదికి తీసుకెళ్లగా... మరుక్షణమే ఊహించని ఘటన...

అది ఓ వివాహ కార్యక్రమం. బంధువులు, స్నేహితులు, సన్నిహితులతో మండపం కళకళలాడుతూ ఉంది. ఇంతలో ముహూర్త సమయం రానే వచ్చింది. బంధువులంతా అక్షింతలు వేసి, వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం పెళ్లికుమారుడు, పెళ్లికుమార్తె దండలు మార్చుకున్నారు. తర్వాత స్నేహితులంతా కలిసి వధువును ఓ గదికి తీసుకెళ్లారు. అయితే లోపల అనూహ్యంగా చోటు చేసుకున్న ఘటనతో అప్పటిదాకా సందడిగా ఉన్న కళ్యాణ మండపం.. ఒక్కసారిగా మూగబోయింది. వివరాల్లోకి వెళితే.. 


ఉత్తరప్రదేశ్ మధురలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక నౌజిల్ పరిధి ముబారిక్‌పూర్‌లో ఖుబీరామ్ ప్రజాపతి అనే వ్యక్తి తన కుమార్తె కాజల్ పెళ్లి ఏర్పాట్లు చేశారు. బంధువులు, సన్నిహితులు, స్నేహితులంతా గురువారం రాత్రి మండపానికి చేరుకున్నారు. అర్ధరాత్రికి వరుడు కూడా ఊరేగింపుగా అక్కడికి చేరుకున్నాడు. అందరి సమక్షంలో వివాహ కార్యక్రమం ఘనంగా జరిగింది. తర్వాత వరమాల కార్యక్రమం నిర్వహించారు. వధూవరులు దండలు మార్చుకున్న తర్వాత.. వధువును స్నేహితులు ఓ గదికి తీసుకెళ్లారు. లోపలికి వెళ్లీ వెళ్లగానే ఒక్కసారిగా కాల్పుల శబ్ధం వినిపించింది. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ఓ బుల్లెట్.. వధువు కంటిలో నుంచి దూసుకెళ్లింది. కాల్పుల శబ్ధంతో అప్పటిదాకా సందడిగా ఉన్న ఆ ప్రాంతం.. ఒక్కసారిగా మూగబోయింది.

పెళ్లి వేడుకలో వరుడి ప్రవర్తన చూసి వధువు తండ్రి షాకింగ్ నిర్ణయం.. అదే ముహూర్తానికి కూతురికి వేరే వ్యక్తితో..


అంతా పరుగుపరుగున అక్కడికి చేరుకున్నారు. తీవ్రగాయాలపాలైన వధువును చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోలీసుల విచారణలో అసలు నిజం తెలిసింది. కాజల్ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని తేలింది. ఖుబీరామ్ ప్రజాపతి ఇంటికి సమీపంలో ఉంటున్న హర్దయాల్ యాదవ్ అనే యువకుడు.. కాజల్‌ను ప్రేమిస్తున్నాడు. అయితే ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ.. కాజల్‌కు వేరే వ్యక్తితో వివాహం నిశ్చయం చేశారు. ఈ కారణంతోనే హర్దయాల్ యాదవ్.. ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.

గుర్రంపై ఊరేగింపునకు సిద్ధమైన వరుడు.. సడన్‌గా పోలీసుల ఎంట్రీ.. అసలు నిజం తెలిసి వధువుకు షాక్..!

Updated Date - 2022-04-29T15:45:42+05:30 IST