చెరువులో ఈత కొడుతున్న కుర్రాళ్ల కాళ్లకు తగిలిందో మూట.. అనుమానంతో అందరూ కలిసి దాన్ని ఒడ్డుకు తెచ్చి చూస్తే..
ABN , First Publish Date - 2022-06-26T03:08:25+05:30 IST
కొందరు యువకులు ఓ చెరువులో సరదాగా ఈత కొడుతున్నారు. ఈ క్రమంలో వారి కాళ్లకు ఓ మూట తగిలింది. అనుమానంతో అంతా కలిసి ఆ మూటను ఒడ్డుకు తీసుకొచ్చారు. అందులో ఏముందో అని అంతా కంగారుగా ఎదురు...
కొందరు యువకులు ఓ చెరువులో సరదాగా ఈత కొడుతున్నారు. ఈ క్రమంలో వారి కాళ్లకు ఓ మూట తగిలింది. అనుమానంతో అంతా కలిసి ఆ మూటను ఒడ్డుకు తీసుకొచ్చారు. అందులో ఏముందో అని అంతా కంగారుగా ఎదురు చూస్తున్నారు. చివరకు మూట తెరచి చూసి అంతా షాక్ అయ్యారు. పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేశారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
ఛత్తీస్‌గఢ్‌లోని జంజ్‌గిర్-చంపా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. తాల్దేవారి అనే ప్రాంతంలో నివాసం ఉంటున్న 12వ తరగతి చదువుతున్న బాలిక.. జూన్ 21వ తేదీ నుంచి కనిపించలేదు. కంగారుపడిన తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. అయినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమె కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం తాల్దేవారి గ్రామ సమీపంలోని చెరువులో కొందరు యువకులు ఈత కొడుతున్నారు. ఆ సమయంలో వారి కాళ్లకు ఓ మూట తగిలింది.
నీ రూమ్‌కు వెళ్లి రెస్ట్ తీసుకుంటా అనగానే ఫ్రెండ్‌కు తాళం ఇచ్చాడో వ్యక్తి.. రాత్రి వెళ్లి చూస్తే తెరచి ఉన్న తలుపులు.. లోపలకు వెళ్తే..
దీంతో అంతా కలిసి మూటను ఒడ్డుకు తీసుకొచ్చి, తెరచి చూశారు. అందులో బాలిక మృతదేహం కుళ్లిపోయి ఉండడం చూసి షాక్ అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విచారణలో బాలికను ఎవరో హత్య చేసి, మృతదేహాన్ని పాలిథిన్ కవర్‌లో చుట్టి చెరువులో పడేసినట్లు గుర్తించారు. ఆమె మృతికి ప్రేమ వ్యవహారామా.. లేక వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా.. అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.