Abn logo
Jan 16 2021 @ 00:59AM

యువతకు చదువుతో పాటు క్రీడలు అవసరం

 రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ డీసీపీ నారాయణరెడ్డి 

వలిగొండ, జనవరి 15: యువకులు చదువుతో పాటు క్రీడలకు కూడా తగిన ప్రాధాన్యం ఇవ్వాలని రాచకొండ పోలీస్‌ కమీషనరేట్‌ డీసీపీ నారాయణరెడ్డి, ఎంపీపీ నూతి రమేష్‌ రాజు  అన్నారు. శుక్రవారం మండలంలోని మాందాపురం గ్రామంలో ఎస్‌ఎస్‌ఆర్‌ సౌజన్యంతో జిల్లా స్థాయి వాలీబాల్‌ టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో వారు మాట్లాడుతూ శారీరక ఆరోగ్యానికి మానసిక వికాసానికి క్రీడలు అవసరం అన్నారు. గ్రామీణ స్థాయిలో క్రీడలు నిర్వహిస్తున్న ఎస్‌ఎ్‌సఆర్‌కు అభినందనలు తెలిపారు. క్రీడల వల్ల క్రీడాకారుల్లో స్నేహభావం మెరుగు పడుతుందన్నారు. గెలుపు ఓటములు ఆటల్లో సహజమని తెలిపారు. సంగెం గ్రామంలో వైస్‌ఎంపీపీ బాతరాజు ఉమా బాలనర్సింహ సహకారంతోవిజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో నిర్వాహకులు  శ్రీకాంత్‌రెడ్డి, గ్రామ సర్పంచ్‌ సోలిపురం సాగర్‌రెడ్డి, నాయకులు అనంతరెడ్డి, రాములు, రామన్నపేట సీఐ శ్రీనివాస్‌, ఎస్‌ఐ రాఘవేందర్‌గౌడ్‌ పాల్గొన్నారు. 


సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల నియంత్రణ: డీసీపీ

 బీబీనగర్‌ : సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలు చాలా వరకు తగ్గడమే కాకుండా నేరస్థులను గుర్తించి పట్టుకోవడానికి దోహదపడుతున్నాయని  డీసీపీ నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం బీబీనగర్‌ మండలం రుద్రవెల్లి గ్రామంలో లక్ష్మీనరసింహ పౌల్ర్టీ యాజమాన్యం సహకారంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో ఏసీపీ భుజంగరావు, సీఐ జానయ్య, ఎస్‌ఐ రాఘవేందర్‌గౌడ్‌, దాత గోవిందరాజు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement