నిరుద్యోగ యువతకు ఉపాధి

ABN , First Publish Date - 2021-02-24T06:00:39+05:30 IST

నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌ట్రక్షన్‌(నాక్‌), ఆంధ్రప్రదేశ్‌ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు రిఫ్రిజిరేటర్‌, ఏసీ, వాషింగ్‌ మిషన్‌ మరమ్మతులపై ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు నాక్‌ గుంటూరు జిల్లా అధికారి వి.నరసింహారావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

నిరుద్యోగ యువతకు ఉపాధి

 గుంటూరు(విద్య), ఫిబ్రవరి 23: నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌ట్రక్షన్‌(నాక్‌), ఆంధ్రప్రదేశ్‌ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు రిఫ్రిజిరేటర్‌, ఏసీ, వాషింగ్‌ మిషన్‌ మరమ్మతులపై ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు నాక్‌ గుంటూరు జిల్లా అధికారి వి.నరసింహారావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇంటర్‌ లేదా ఐటీఐలో ఉత్తీర్ణులైన వారు అర్హులని, రెండు నెలల పాటు శిక్షణ ఇస్తామని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు గుంటూరులోని ఆర్టీసీ బస్టాండు సమీపంలోని నాక్‌  కార్యాలయంలో(9533219919)లో సంప్రదించాలని సూచించారు. 

Updated Date - 2021-02-24T06:00:39+05:30 IST