ఒంటరిగా ఉన్న 19 ఏళ్ల యువతి.. ఇంట్లోకి దూరి ఆమె జుట్టు కత్తిరించిన 21 ఏళ్ల కుర్రాడు.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2021-09-08T20:45:27+05:30 IST

19 ఏళ్ల యువతి ఇంట్లో ఒంటరిగా ఉంది.. ఇంతలో ఎదురుంటి యువకుడు ఆమె ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించాడు..

ఒంటరిగా ఉన్న 19 ఏళ్ల యువతి.. ఇంట్లోకి దూరి ఆమె జుట్టు కత్తిరించిన 21 ఏళ్ల కుర్రాడు.. అసలేం జరిగిందంటే..

19 ఏళ్ల యువతి ఇంట్లో ఒంటరిగా ఉంది.. ఇంతలో ఎదురుంటి యువకుడు ఆమె ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించాడు.. అతడి చేతిలోని కత్తెరను చూసి ఆ యువతి భయపడింది.. ఆ యువకుడు ఆమె దగ్గరకు వెళ్లి ఆమె జుట్టు కత్తిరించి అక్కణ్నుంచి పారిపోయాడు.. షాకైన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.. కేరళలోని ఇడుక్కిలో ఈ ఘటన జరిగింది. 


ఇవి కూడా చదవండి


ఇంట్లో దూరిన తాచు పామును చూసి ఏమాత్రం భయపడకుండా.. మాటలతోనే ఈ మహిళ చేసిన మాయకు నెటిజన్లు ఫిదా





బైక్‌పై ప్రేయసితో అనూహ్య ఫీట్లు.. ముందు కూర్చోబెట్టుకుని మరీ హగ్గులతో డ్రైవింగ్.. చివరకు..



ఇడుక్కిలోని ఎస్టేట్ వర్కర్స్ ప్రాంతంలో నివసిస్తున్న సుశీల్ కుమార్ అనే యువకుడు తన ఎదురింట్లో ఉంటున్న 19 ఏళ్ల యువతిపై మనసు పారేసుకున్నాడు. తన ప్రేమ విషయాన్ని ఆమెకు ఎన్నోసార్లు చెప్పాడు. అన్నిసార్లూ ఆమె సుశీల్ ప్రేమను తిరస్కరించింది. దీంతో ఆమెపై ఆగ్రహం పెంచుకున్న సుశీల్ సోమవారం ఉదయం ఆమె ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించాడు. ఓ కత్తెర తీసుకెళ్లి ఆమె జట్టు కత్తిరించేశాడు. ముందు షాకైన బాలిక తర్వాత తల్లిదండ్రులతో విషయం చెప్పి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 

Updated Date - 2021-09-08T20:45:27+05:30 IST