Advertisement
Advertisement
Abn logo
Advertisement

అగ్నిప్రమాద బాధితులకు అండగా ఎమ్మెల్యే తెల్లం బాలరాజు

ఏలూరు/పోలవరం : సోమవారం నాడు పోలవరం నియోజకవర్గంలోని కొయ్యలగూడెం మండలంలో అగ్నిప్రమాదం చోటుచేసుకున్న విషయం విదితమే. విషయం తెలుసుకున్న పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు.. ఇళ్ళు కాలిపోయిన మోగసాల రమణమ్మ, తొర్లపాటి శాంతి, జనుపాటి పుణ్యవతి, కండెల్లి గోదారమ్మలను పరామర్శించారు. ఒక్కొక్క కుటుంబానికి పదివేల రూపాయిలు చొప్పున నాలుగు కుటుంబాలకు 40 వేలు.. అలాగే ప్రతి కుటుంబానికి దుప్పట్లు, చీరలు, బియ్యం పంపిణీ చేశారు.


అన్ని విధాలా ఆదుకుంటాం..

బాధితులను అన్నివిధాలుగా ఆదుకుంటామని బాలరాజు భరోసా ఇచ్చారు. అదే విధంగా.. ప్రభుత్వ పరంగా అందవలసిన సహాయాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని తహశీల్దార్‌ని ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కొయ్యలగూడెం తహశీల్దార్, ఎస్ఐ, గొడ్డాటి నాగేశ్వరరావు, సంకు కొండ, గంటా శ్రీనివాసరావు, సుబ్రహ్మణ్యం, మంతెన సోమరాజు, మట్టా సత్తిపండు, గంజిమాల రామారావు, చిక్కాల దుర్గా ప్రసాద్, షేక్ బాజీ తదితరులు పాల్గొన్నారు.

ప్రమాదం ఎలా జరిగింది..!?

సోమవారం జరిగిన అగ్ని ప్రమాదంలో నాలుగు తాటాకిళ్లు దగ్ధమయ్యాయి. ఇళ్లలో సామగ్రి, దుస్తులు కాలిబూడిదయ్యాయి. పొయ్యి వద్ద మంటలు ఎగసి అగ్ని ప్రమాదం సంభవించినట్లు చెబుతున్నారు. మోగసాల రమణమ్మ, తొర్లపాటి శాంతి, కండెల్లి గోదారమ్మ, జానుపాటి పుణ్యవతి కుటుంబాల వారు నిరాశ్రయులయ్యారు. మోగసాల రమణమ్మ కుమార్తె వివాహం కోసం దాచుకున్న నగదు, దుస్తులు, బంగారం కాలిబూడిద కావడంతో బోరున విలపించారు. మొత్తం సుమారు రూ.10లక్షల ఆస్తి నష్టం ఉంటుందని భావిస్తున్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలికి చేరుకున్నారు. మంటలు అదుపుచేసే ప్రయత్నం చేసి నప్పటికీ ఇళ్లు పూర్తిగా కాలిపోయాయి. బాధితులకు సమాఖ్య యూత్‌, స్పందన సంస్థ, వ్యాపారవేత్త సత్తిబాబు, పలువురు దాతలు సహాయం అందించారు.

Advertisement
Advertisement