Advertisement
Advertisement
Abn logo
Advertisement

కేటీఆర్ షేమ్ ఆన్ యూ...: Sharmila

నిజామాబాద్: సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై వైఎస్సార్‌టీపీ అధినేత షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం తెలంగాణ యూనివర్సిటీ వద్ద మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ నిరుద్యోగులకు తీరని ద్రోహం చేస్తున్నారన్నారు. ‘‘యువతకు 5 శాతం ఉద్యోగాలు.. మీ కుటుంబంలో వంద శాతం ఉద్యోగాలా?’’ అని ప్రశ్నించారు. కేటీఆర్ షేమ్ ఆన్ యూ.. అసెంబ్లీలో చేసిన ప్రకటనకు సిగ్గు పడాలని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలు సోమరిపోతులు కాదని.. గడీలో బతికే కేసీఆర్ సోమరిపోతని షర్మిల అన్నారు. తెలంగాణ యూనివర్సిటీలో ప్రొఫెసర్లు 20 మందికి గాను ఆరుగురు ఉన్నారని తెలిపారు. 67 శాతం ఖాళీలు ఉన్నాయన్నారు. ఏ యూనివర్సిటీ అయినా ఇదే పరిస్థితి ఉందని తెలిపారు. ఖాళీ యూనివర్సిటీ లుగా తయారు చేశారని మండిపడ్డారు. ‘‘ఇక్కడి వీసీ ఈ పోస్టు కోసం రూ.2 కోట్లు ఇచ్చాడట.. వాటిని ఎలా సంపాదించుకోవాలా అని చూస్తున్నారు’’ అని అన్నారు. టెంపరరీ ఉద్యోగులను నియమించి భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. 570 ఎకరాల్లో పదో వంతు టీఆర్‌ఎస్ నాయకులు కబ్జా చేశారని షర్మిల అన్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement