Advertisement
Advertisement
Abn logo
Advertisement

నవంబర్‌‌లో పెళ్లంటే వణుకే... కారణం తెలిస్తే శభాష్ అంటారు!

హరారే: అదృష్టం, దురదృష్టం...వీటిని నిర్వచించడం బహుకష్టం. వీటిపై నమ్మకం పెంచుకున్న జనం... ఏపని ప్రారంభించాలన్నా మంచిరోజు కోసం ఎదురు చూస్తుంటారు. ఇదేవిధమైన నమ్మకాలు కలిగిన జింబాబ్వే జనం నవంబర్ లో పెళ్లంటే హడలిపోతుంటారు. నవంబర్‌లో పెళ్లి చేసుకుంటే కొంతకాలం తరువాత వారి పెళ్లి పెటాకులు అవుతుందని, అలాగే సంతానం కలగదని నమ్ముతుంటారు. 

ఈ విధమైన సమ్మకం కలిగిన షోనా కమ్యూనిటీ ప్రజలు దక్షిణ ఆఫ్రికాలో... ముఖ్యంగా జింబాబ్వేలో ఉంటారు. నవంబరు మాసంలో ఇక్కడ భారీ వర్షాలు కురుస్తుంటాయి. వృక్షజాలం, జంతుజాలం... ఈ ​​రెండింటి అభివృద్ధికి ఈ నెల చాలా కీలకం. దీనికి ఆటంకం కలిగించేలా వేడుకలు చేయకూడదని ఇక్కడ ప్రజలు నిర్ణయించుకుని ఆచారంలా పాటిస్తుంటారు. పశు సమృద్దికి, వృక్ష సంపదకు ఆటంకం కలిగించేలా నవంబరు మాసంలో వేడుకలు నిర్వహించరు.  దీనిని ఆధారంగా చేసుకునే షోనా కమ్యూనిటీ ప్రజలు నవంబరులో వివాహాలు, వేడుకలు చేసుకోరు.

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement