Share News

AP ELECTIONS : ఓటుకు రూ.2 వేలు

ABN , Publish Date - May 09 , 2024 | 12:34 AM

పోలింగ్‌ తేదీ సమీపిస్తుండటంతో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వైసీపీ డబ్బు పంపిణీని ప్రారంభించింది. ఓటుకు రూ.2 వేల ప్రకారం బుధవారం పంచినట్లు తెలిసింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరవర్గం నియోజకవర్గంలో తిష్టవేసి.. డబ్బు పంపిణీ వ్యవహారాలను చూస్తోందని ప్రచారం జరుగుతోంది. గ్రామాల్లో ముఖ్యమైన నాయకులకు డబ్బులు చేరవేసి.. అక్కడి నుంచి పంచాయతీల వారీగా డబ్బులు చేరవేస్తున్నట్లు సమాచారం. గ్రామ పంచాయతీ పరిధిలో వలంటీర్లను దగ్గర పెట్టుకుని.. వైసీపీ...

AP ELECTIONS : ఓటుకు రూ.2 వేలు

పంపిణీ ప్రారంభించిన వైసీపీ

మంత్రి పెద్దిరెడ్డి టీం పర్యవేక్షణ..?

కళ్యాణదుర్గం, మే 8: పోలింగ్‌ తేదీ సమీపిస్తుండటంతో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వైసీపీ డబ్బు పంపిణీని ప్రారంభించింది. ఓటుకు రూ.2 వేల ప్రకారం బుధవారం పంచినట్లు తెలిసింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరవర్గం నియోజకవర్గంలో తిష్టవేసి.. డబ్బు పంపిణీ వ్యవహారాలను చూస్తోందని ప్రచారం జరుగుతోంది. గ్రామాల్లో ముఖ్యమైన నాయకులకు డబ్బులు చేరవేసి.. అక్కడి నుంచి పంచాయతీల వారీగా డబ్బులు చేరవేస్తున్నట్లు సమాచారం. గ్రామ పంచాయతీ పరిధిలో వలంటీర్లను దగ్గర పెట్టుకుని.. వైసీపీ సానుభూతిపరుల ఇళ్లకు వెళ్లి రూ.2 వేలు ఇచ్చారని తెలిసింది. కంబదూరు,


కుందుర్పి, శెట్టూరు, బ్రహ్మసముద్రం మండలాల పరిధిలో ఇప్పటికే 80 శాతం వరకు డబ్బుల పంపిణీ ముగించారని బహిరంగంగా చర్చించుకుంటున్నారు. కొన్ని మండలాల్లో పగటి పూట, మరికొన్ని మండలాల్లో రాత్రి పూట డబ్బులు పంపిణీ చేశారని తెలిసింది. మంత్రి పెద్దిరెడ్డి అనుచరవర్గం నియోజకవర్గం మొత్తం కలియతిరిగి.. వైసీపీ అసమ్మతి నాయకులను బుజ్జగించి, వారికి కూడా డబ్బు ఎరవేస్తోందని విశ్వసనీయ సమాచారం. శెట్టూరు, కుందుర్పి మండలాల పరిధిలో కొన్ని గ్రామాల్లో డబ్బులను నిరాకరించారని తె లిసింది. ‘మీరు ఏం అభివృద్ధి చేశారు..? మాకు డబ్బులు వద్దు. మీకు ఓటు వేయం’ అని ముఖానే చెప్పినట్లు తెలిసింది. కంబదూరులో పట్టపగలు డబ్బులు పంపిణీ చేస్తున్నారని, పోలీసులకు సమాచారం చేరవేసినా పట్టించుకోలేదని కొందరు విమర్శించారు. నియోజకవర్గ కేంద్ర పరిధిలో మాత్రం ఇంకా డబ్బు పంపిణీ ప్రారంభం కాలేదు. ఇక్కడ వైసీపీ నాయకులు రహస్యంగా టీడీపీ సానుభూతిపరులను కలిసి.. తమకే ఓటు వేయాలని బెదిరిస్తున్నట్లు తెలిసింది. నియోజకవర్గంలోకి కొత్త వ్యక్తుల సంచారంతో రాజకీయం వేడెక్కింది. ఓటమి భయంతోనే వైసీపీ డబ్బుల పంపిణీకి తెరలేపిందని టీడీపీ నాయకులు విమర్శించారు.

మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 09 , 2024 | 12:34 AM