Share News

AP Elections: జగన్‌‌కు ఓటు అడిగే హక్కు లేదు: పవన్ కల్యాణ్

ABN , Publish Date - Apr 27 , 2024 | 08:34 PM

సీఎం జగన్‌కు ఓటు అడిగే హక్కు లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. రాష్ట్రంలో అన్ని వర్గాలను జగన్ మోసం చేశారు. మద్య పాన నిషేధం అని చెప్పి ఛీట్ చేశారు. చివరికి జగన్ సారా వ్యాపారిలా మారారు. జే బ్రాండ్ మద్యంతో రూ.41వేలు కోట్లు అక్రమంగా సంపాదించారు.

AP Elections: జగన్‌‌కు ఓటు అడిగే హక్కు లేదు: పవన్ కల్యాణ్
pawan kalyan

కాకినాడ: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. ఓటరు దేవుళ్లను ఆకట్టుకునే పనిలో నేతలు బిజీగా ఉన్నారు. పార్టీ అధినేతలు నియోజకవర్గాలను చుట్టొస్తున్నారు. కాకినాడ రూరల్ నియోజక వర్గం ఇంద్రపాలెం సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.


AP Elections: వైసీపీ మేనిఫెస్టో: నాడు - నేడు


పవన్ ఏమన్నారంటే..?

‘సీఎం జగన్‌కు ఓటు అడిగే హక్కు లేదు. రాష్ట్రంలో అన్ని వర్గాలను జగన్ మోసం చేశారు. మద్య పాన నిషేధం అని చెప్పి ఛీట్ చేశారు. చివరికి జగన్ సారా వ్యాపారిలా మారారు. జే బ్రాండ్ మద్యంతో రూ.41వేలు కోట్లు అక్రమంగా సంపాదించారు. రాష్ట్రంలో ఎవరు జీవించొద్దు అనుకునే దుర్మార్గుడు మిథున్ రెడ్డి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గంజాయిపై ఉక్కుపాదం మోపుతాం. వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు తీరు సరికాదు. తన సోదరుడు చిరంజీవి పెట్టిన బిక్షతో కన్నబాబు ఎదిగారు. జగన్ కాపులకు రిజర్వేషన్లు ఇవ్వలేదు. ఈబీసీ రిజర్వేషన్లను తీసేశాడు. మిగిలిన కులాలకు కూడా జగన్ అన్యాయం చేశాడు. వైసీపీ నేతలు ప్రమాదకర పాలసీలు తీసుకొస్తున్నారు అని’ పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.


AP Elections: వైసీపీ మేనిఫెస్టో: నాడు - నేడు


Read More
Andhra Pradesh and Telugu News Here

Updated Date - Apr 27 , 2024 | 08:36 PM