Share News

Big Breaking: పిఠాపురం వైసీపీ అభ్యర్థికి అస్వస్థత.. మధ్యలోనే వెళ్లిపోయిన గీత!

ABN , Publish Date - Apr 18 , 2024 | 12:53 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల (AP Elections) నగరా మోగడంతో.. అధికార, విపక్షాల అభ్యర్థులు ప్రచార జోరు పెంచారు. అభ్యర్థుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సమయం తక్కువగా ఉండటంతో నియోజకవర్గంలో ఏ ఇల్లూ వదిలిపెట్టకుండా ప్రచారం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా.. పిఠాపురంలో (Pithapuram) జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) బరిలోకి దిగడంతో.. ఆయన్ను ఓడించడానికి వైసీపీ ఏం చేయడానికైనా వెనక్కి తగ్గట్లేదు. ఒక్కో మండలానికి ఒక్కో సీనియర్ నేతను ఇంచార్జ్‌గా నియమించి అడ్డదారుల్లో గెలవడానికి విశ్వప్రయత్నాలు చేస్తోంది వైసీపీ..

Big Breaking: పిఠాపురం వైసీపీ అభ్యర్థికి అస్వస్థత.. మధ్యలోనే వెళ్లిపోయిన గీత!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల (AP Elections) నగరా మోగడంతో.. అధికార, విపక్షాల అభ్యర్థులు ప్రచార జోరు పెంచారు. అభ్యర్థుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సమయం తక్కువగా ఉండటంతో నియోజకవర్గంలో ఏ ఇల్లూ వదిలిపెట్టకుండా ప్రచారం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా.. పిఠాపురంలో (Pithapuram) జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) బరిలోకి దిగడంతో.. ఆయన్ను ఓడించడానికి వైసీపీ ఏం చేయడానికైనా వెనక్కి తగ్గట్లేదు. ఒక్కో మండలానికి ఒక్కో సీనియర్ నేతను ఇంచార్జ్‌గా నియమించి అడ్డదారుల్లో గెలవడానికి విశ్వప్రయత్నాలు చేస్తోంది వైసీపీ.


Vanga-Geetha-Illness.jpg

అస్వస్థత.. ఆపేశారు!

ఇక వైసీపీ అభ్యర్థి వంగా గీత (Vanga Geetha) ఇంటింటికీ ప్రచారం చేస్తూ తెగ కష్టపడుతున్నారు. మండుటెండను కూడా లెక్కచేయకుండా ప్రచారం నిర్వహిస్తున్న గీత.. ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. పిఠాపురం మండలం ఎఫ్‌కె పాలెంలో ప్రచారం నిర్వహిస్తుండగా గీతకు ఇలా జరిగింది. దీంతో వెంటనే ఎన్నికల ప్రచారాన్ని ఆపేసి.. గీతను స్థానికంగా ఉన్న ఆస్పత్రికి అనుచరులు తీసుకెళ్లారు. ఈ ఘటనతో గీత అభిమానులు, అనుచరులు ఆందోళన చెందుతున్నారు. విరామం లేకుండా ఎన్నికల ప్రచారం చేస్తుండటంతో అస్వస్థతకు లోనయ్యారని అభిమానులు, వైసీపీ కార్యకర్తలెవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. గురువారం సాయంత్రం నుంచి మళ్లీ యథావిధిగా ఎన్నికల ప్రచారం ఉంటుందని గీత సన్నిహితులు చెబుతున్నారు.

Vanga-Geetha-Election-Campa.jpg

ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..

Updated Date - Apr 18 , 2024 | 12:59 PM