మా కుక్కను ఎందుకు కొడుతున్నారు.. అని యువతి అన్నందుకు.. అర్ధరాత్రి అందరి ముందే ఆ ఆకతాయిలు చేసిన పని..

ABN , First Publish Date - 2021-12-12T21:34:23+05:30 IST

మధ్యప్రదేశ్‌లో కొందరు యువకులు మద్యానికి బానిసై.. అల్లరి చిల్లరిగా తిరిగేవారు. ఓ రోజు అర్ధరాత్రి కాలనీలో తిరుగుతుండగా..

మా కుక్కను ఎందుకు కొడుతున్నారు.. అని యువతి అన్నందుకు.. అర్ధరాత్రి అందరి ముందే ఆ ఆకతాయిలు చేసిన పని..

కొందరు యువకులు రోజురోజుకూ మరీ దారుణంగా తయారువుతున్నారు. చదువుకోవాల్సిన వయసులో మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారు. నిత్యం మత్తులో జోగుతూ తాము ఏం చేస్తున్నామో.. తమకే తెలీనంతంగా దిగజారిపోతున్నారు. పొద్దున నుంచి రాత్రి వరకూ జులాయిగా తిరుగడమే పనిగా పెట్టుకున్నారు. మధ్యప్రదేశ్‌లో ఇలాగే కొందరు యువకులు మద్యానికి బానిసై.. అల్లరి చిల్లరిగా తిరిగేవారు. ఓ రోజు అర్ధరాత్రి కాలనీలో తిరుగుతుండగా.. కుక్క వారిని చూసి మొరిగింది. దీంతో ఆకతాయిలు దాన్ని తీవ్రంగా కొట్టారు. శబ్ధాలు విని బయటికొచ్చిన ఓ యువతి, ‘‘మా కుక్కను ఎందుకు కొడుతున్నారు’’.. అని వారిని ప్రశ్నించింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆ యువకులు.. మమ్మల్నే ఎదురు ప్రశ్నిస్తావా.. అంటూ రెచ్చిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది...


మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లోని గర్హా పోలీస్ స్టేషన్ పరిధిలోని కాలనీలో శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ కాలనీలో శుక్రవారం రాత్రి అంతా గాఢనిద్రలో ఉన్నారు. సమీప ప్రాంతానికి చెందిన నలుగురు యువకులు నిత్యం మత్తులో జోగుతూ జులాయిగా తిరుగుతుంటారు. ఫుల్‌గా మందు తాగి రోజూ రచ్చ రచ్చ చేస్తుంటారు. రాత్రిళ్లు బైకులను వేగంగా నడుపుతూ అందరికీ నిద్రా భంగం చేసేవారు. తమకు ఎవరైనా అడ్డుపడితే దాడులు చేయడమే పనిగా పెట్టుకునేవారు. శుక్రవారం రాత్రి కూడా వారంతా పీకలదాకా మందు తాకి కాలనీలోకి వచ్చారు. పెద్ద పెద్ద శబ్ధాలు చేస్తూ రచ్చ రచ్చ చేశారు. వారిని చూసిన ఓ కుక్క పదే పదే అరవడం మొదలెట్టింది. దీంతో కోపం తెచ్చుకున్న వారు దానిపై ఇనుప రాడ్డుతో దాడి చేశారు. వారి అరుపులు, కేకలకు చుట్టు పక్కల వారంతా నిద్ర లేచారు.

బాధపడుతూ ఇంటికొచ్చిన తండ్రి.. ఏమైంది నాన్నా.. అంటూ కంగారుగా అడిగిన కూతురు.. విషయం తెలుసుకుని టీ దుకాణానానికి వెళ్లి..


కుక్క యజమానురాలైన యువతి కూడా బయటికొచ్చింది. తమ కుక్కను కొట్టడం చూసి ఆ యువకులను అడ్డుకుంది. ‘‘మా కుక్కను ఎందుకు కొడుతున్నారు’’.. అంటూ వారిని నిలదీసింది. ఆ యువతి అలా అనగానే.. అప్పటికే మద్యం మత్తులో ఉన్న వారికి, కోపం ఇంకా  ఎక్కువైంది. ఆమెపై దుర్భాషలాడుతూ, పక్కనే ఉన్న పెద్ద కర్ర తీసుకుని.. ఆడపిల్ల అని కూడా చూడకుండా దాడి చేశారు. అడ్డుకోవడానికి వచ్చిన పక్కనున్న వారిని కూడా బెదిరించారు. బాలిక కుటుంబ సభ్యులు, మరికొంత మంది అక్కడికి చేరుకోగానే.. యువకులంతా అక్కడి నుంచి పరారయ్యారు. బాలిక మేనమామ అర్జున్ సింగ్.. ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పిన్స్ శ్రీవాస్తవ, మోను శ్రీవాస్తవ, శిబు దహియా, బబ్లూ శ్రీవాస్తవలను నిందితులుగా గుర్తించారు. ప్రస్తుతం వారి కోసం గాలిస్తున్నారు.

తల్లి ఒడిలో కూర్చుని హాయిగా ఆడుకుంటున్న రెండేళ్ల చిన్నారి.. ఇంతలోనే సడన్‌గా దూసుకొచ్చిన తూటా.. అసలేం జరిగిందంటే..



Updated Date - 2021-12-12T21:34:23+05:30 IST