బాధపడుతూ ఇంటికొచ్చిన తండ్రి.. ఏమైంది నాన్నా.. అంటూ కంగారుగా అడిగిన కూతురు.. విషయం తెలుసుకుని టీ దుకాణానానికి వెళ్లి..

ABN , First Publish Date - 2021-12-11T02:17:06+05:30 IST

వృద్ధాప్యంలో ఉన్న తండ్రికి చిన్న బాధ కలిగినా కూతుళ్లు భరించలేరు. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. వృద్ధాప్యంలో ఉన్న తండ్రి.. ఓ రోజు బాధపడుతూ ఇంటికొచ్చాడు. దీంతో..

బాధపడుతూ ఇంటికొచ్చిన తండ్రి.. ఏమైంది నాన్నా.. అంటూ కంగారుగా అడిగిన కూతురు.. విషయం తెలుసుకుని టీ దుకాణానానికి వెళ్లి..

చాలా మంది తండ్రులు.. కూతురు పట్టిందంటే చాలా బాధపడుతూ ఉంటారు. కొందరైతే, కూతురును కన్నందుకు భార్యపై కూడా అసహ్యం పెంచుకుంటూ ఉంటారు. కొడుకు పుడితే కలిగే ఆనందం.. కూతురు పుట్టినప్పుడు ఉండదు. అయితే తండ్రిపై కొడుకు కంటే కూతురికే ఎక్కువ ప్రేమ ఉంటుందనే విషయం చాలా మంది గ్రహించరు. వృద్ధాప్యంలో ఉన్న తండ్రికి చిన్న బాధ కలిగినా కూతుళ్లు భరించలేరు. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. వృద్ధాప్యంలో ఉన్న తండ్రి.. ఓ రోజు బాధపడుతూ ఇంటికొచ్చాడు. దీంతో ఏమైంది నాన్నా.. అంటూ కంగారుగా అడిగింది కూతురు. విషయం తెలుసుకుని టీ దుకాణానికి వెళ్లింది. తర్వాత ఆమె చేసిన పని, అందరినీ షాక్‌కు గురిచేసింది..


మధ్యప్రదేశ్‌ శివపురిలోని దినారా పట్టణంలో తేజ్ సింగ్ పరిహార్ అనే వృద్ధుడు భార్య, కుమార్తెతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఓ రోజు పట్టణానికి సమీపంలోని దుకాణానికి వెళ్లి టీ తాగాడు. అనంతరం రూ.5లు ఇచ్చి వెళ్తుండగా.. దుకాణ యజమానికి అడ్డుకున్నాడు. తనకు డబ్బులు ఇవ్వలేదంటూ గొడవ పడ్డాడు. ఈ క్రమంలో వృద్ధుడిపై చేయి చేసుకున్నాడు. అక్కడి నుంచి ఇంటికి వెళ్లిన వృద్ధుడు బాధపడుతూ కనిపించడం చూసి కూతురు కంగారుపడింది. ఏమైంది నాన్నా.. అంటూ అడగడంతో జరిగిన విషయమంతా చెప్పేశాడు. అంతే.. తన నాన్నపై చేయి చేసుకున్నాడని తెలియగానే తీవ్ర ఆగ్రహానికి గురైంది. ‘‘వాడి పాపాన వాడే పోతాడులేమ్మా.. వదిలేసెయ్’’.. అంటూ తండ్రి సర్దిచెబుతున్నా వినిపించుకోలేదు. వెంటనే ఇంట్లోని పెద్ద కర్రను తీసుకుని ఆవేశంగా టీదుకాణం వద్దకు వెళ్లింది.

పొలంలో పశువులు మేపుతున్న మహిళ.. సాయంత్రం ఇంటికి తిరిగొస్తుండగా ఓ చెట్టు వద్ద కనిపించిందో షాకింగ్ సీన్..


వెళ్లీ వెళ్లగానే ముందు, వెనుకా చూడకుండా దుకాణ నిర్వాహకుడిని చావబాదింది. వృద్ధుడని కూడా చూడకుండా.. నా తండ్రిపైనే చేయి చేసుకుంటావా.. అంటూ ఎడపెడా బాదేసింది. పక్కనున్న వారు కూడా ఆమెకే మద్దతిచ్చారు. తర్వాత టీషాపు నిర్వాహకుడితో సారీ చెప్పించడంతో ఆమె శాంతించింది. ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వారు ఆమెను అభినందనలతో మెుంచెత్తారు. ఓ వ్యక్తి ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. తండ్రిపై ఆమె చూపించిన ప్రేమ అక్కడున్న వారినే కాకుండా నెటిజన్లను కూడా విపరీతంగా ఆకట్టుకుంటోంది.

బీటెక్ పూర్తి కాకుండానే రూ.20 లక్షల ప్యాకేజీతో జాబ్ ఆఫర్.. ఆర్మీలో చేరాలన్న మక్కువతో రిజెక్ట్ చేసి మరీ..



Updated Date - 2021-12-11T02:17:06+05:30 IST