స్పందనకు 432 వినతులు
ABN , First Publish Date - 2022-12-19T23:49:56+05:30 IST
జిల్లా స్థాయి స్పందనకు ఫిర్యాదుదారులు పెద్దఎత్తున తరలివచ్చారు. సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనలో స్పందన కార్యక్రమం నిర్వహించారు.
అనంతపురం టౌన, డిసెంబరు 19: జిల్లా స్థాయి స్పందనకు ఫిర్యాదుదారులు పెద్దఎత్తున తరలివచ్చారు. సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనలో స్పందన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి బాధితులు వందలాది మంది తరలివచ్చి తమ సమస్యలపై వినతులు అందజేశారు. మొత్తం 432 అర్జీలను జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, జేసీ కేతనగార్గ్, అసిస్టెంట్ కలెక్టర్ ప్రశాంతకుమార్, ఆర్డీఓ మధుసూదన, అనసెట్ సీఈఓ కేశవనాయుడు, జడ్పీ సీఈఓ భాస్కర్‌రెడ్డి తదితరులు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ స్పందన ఫిర్యాదులపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల విషయంలో ఎవరు నిర్లక్ష్యం చేసినా సహించేది లేదన్నారు. అర్జీలను సకాలంలో నాణ్యతగా పరిష్కరించాలని ఆదేశించారు. పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, జీఎ్‌సడబ్ల్యూ, వ్యవసాయం, ట్రాన్సపోర్ట్ శాఖల నుంచి ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని, వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కరించాలన్నారు.
ఫ వికలాంగుల జిల్లా కోర్టులో పనిచేస్తూ ఉద్యోగవిరమణ పొందిన ఉద్యోగి సుబ్బయ్య తమ సొంత నిధులతో ముగ్గురికి ట్రై సైకిల్ వితరణ చేశారు. ఆ సైకిల్‌లను జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి చేతుల మీదుగా దివ్యాంగులకు పంపిణీ చేశారు.
బాల్యవివాహాలపై ప్రత్యేక దృష్టి పెట్టండి
చిన్నవయసులో గర్భం దాల్చడం వల్ల తల్లీబిడ్డల ఆరోగ్యంపై తీవ్ర ప్రభా వం పడుతుందని, ప్రజల్లో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాల్య వివాహాలు చట్టవిరుద్ధమన్నారు. చిన్నవయసులోనే వివాహాలు చేయడం వల్ల ఎన్నో అనర్థాలు కలుగుతాయన్నారు. ఆయుష్మాన భారత హెల్త్‌కార్డుల జారీకి వలస కార్మికులకు సైతం ఈకేవైసీ పూర్తి చేయాలన్నారు. సచివాలయ సర్వీ్‌సలను నిర్ణీత సమయంలో అందించాలన్నారు. వివిధ శాఖల భవన నిర్మాణాలు వేగవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో జేసీ కేతనగార్గ్, అసిస్టెంట్ కలెక్టర్ ప్రశాంతకుమార్, డ్వామా పీడీ వేణుగోపాల్‌రెడ్డి, డీపీఓ ప్రభాకరరావు, ఐసీడీఎస్ పీడీ శ్రీదేవి పాల్గొన్నారు.