LLB course Cancellation: ఎస్కే యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీ కోర్స్ రద్దు... విద్యార్థుల ఆగ్రహం
ABN , First Publish Date - 2022-12-05T14:57:22+05:30 IST
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఎల్‌ఎల్‌బీ కోర్స్ రద్దు అయ్యింది. ఈ మేరకు ఎస్కేయూ రిజిస్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ( Srikrishna Devaraya University)లో ఎల్‌ఎల్‌బీ కోర్స్ రద్దు అయ్యింది. ఈ మేరకు ఎస్కేయూ రిజిస్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎల్‌ఎల్‌బీ కోర్సు, ఎల్ఎల్ఎం కోర్సుల తరగతులు నిర్వహించడానికి సరిపడా సిబ్బంది లేనందున ప్రవేశం రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రొఫెసర్ ఎస్వీ పుల్లారెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం శ్రీరాములు మాత్రమే టీచింగ్ సిబ్బంది ఉండటం, ప్రొఫెసర్ ఎస్వీ పుల్లారెడ్డి ఆరు నెలల పాటు మెడికల్ లీవ్‌లో ఉంటున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2022 - 23 విద్యా సంవత్సరానికి ఈ ప్రతిపాదనలు వర్తిస్తాయని, ఈ మేరకు లా సెట్ - 2022 కన్వీనర్‌కు అభ్యర్థన చేశారు. కాగా... రాయలసీమలోని ప్రతిష్టాత్మక శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో లా కోర్సును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంపై విద్యార్థులు మండిపడుతున్నారు. విశ్వవిద్యాలయంలో లా కోర్సు రద్దు చేయటం, మరోవైపు కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు అంటూ ప్రభుత్వ ప్రకటనపై సీమవాసుల్లో ఆగ్రహం పెల్లుబికుతోంది.