అవినీతి, అసమర్థపాలనను తరిమికొడదాం : బీకే

ABN , First Publish Date - 2022-12-03T23:35:35+05:30 IST

రాష్ట్రంలో అవినీతి, అసమర్థ వైసీపీ పాలనను తరిమికొడదామని హిందూపురం పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షు డు బీకే పార్థసారథి పిలుపునిచ్చారు.

అవినీతి, అసమర్థపాలనను తరిమికొడదాం : బీకే

రొద్దం, డిసెంబరు 3: రాష్ట్రంలో అవినీతి, అసమర్థ వైసీపీ పాలనను తరిమికొడదామని హిందూపురం పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షు డు బీకే పార్థసారథి పిలుపునిచ్చారు. శనివారం మండలంలోని తురకలాపట్నం గ్రామంలో పార్టీ ఆధ్వర్యంలో ‘ఇదేం కర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో ర్యాలీగా ఇంటింటికి వెళ్లారు. సమస్యలపై ఆరాతీశారు. ఈసందర్భంగా బీకే మాట్లాడుతూ రాష్ట్రం లో వైసీపీ ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారం మోపుతోందని వి మర్శించారు. సీఎం జగన అసమర్థతతో కియ అనుబంధ పరిశ్రమల న్నీ ఇతర రాష్ట్రాలకు తరిలిపోయాయని పేర్కొన్నారు. పెనుకొండకు కియ పరిశ్రమ, పెనుకొండ కొండపైకి రోడ్డు, గొల్లపల్లి రిజర్వాయర్‌ తెచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. మూడేళ్లుగా ఏ గ్రామంలోనూ ఒక రోడ్డు, ఇల్లు నిర్మించిన పాపాన పోలేదన్నారు. ప్రజలకు ఏం చేశారని వైసీపీ నాయకులు గడప గడపకు వెళ్తున్నారని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో తురకలాపట్నంలో రూ.2కోట్ల తో సీసీ రోడ్లు, నాలుగెకరాల భూమిని ఇళ్ల పట్టాల కోసం కొనుగోలుచేశామన్నారు. చెరువుకు నీరందించామని, హైస్కూల్‌, రూ.30కోట్లతో పావగడ-పెనుకొండ ప్రధాన రహదారి, రొద్దంలో బీసీ రెసిడెన్సియల్‌ లాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. వైసీపీ ప్రభు త్వం చేసింది చెప్పుకోవడానికి ఏమీ లేవని విమర్శించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత, పార్లమెంట్‌ తె లుగు మహిళ అధ్యక్షురాలు సుబ్బరత్నమ్మ, పార్లమెంట్‌ అధికార ప్ర తినిధి రొద్దం నరసింహులు, తెలుగు మహిళ లీలావతి, తెలుగు యువత ఉపాధ్యక్షులు హరీష్‌, కన్వీనర్‌ నరహరి, మాధవనాయుడు, రామక్రిష్టప్ప, మాజీ కన్వీనర్‌ చంద్రమౌళి, టైలర్‌ ఆంజనేయులు, మాజీ సర్పంచులు ఈశ్వర్‌ ప్రసాద్‌, అశ్వర్థనారాయణ, మాజీ ఎంపీటీసీ నాగేంద్ర, టీఎనఎ్‌సఎ్‌ఫ కార్యనిర్వాహక కార్యదర్శి హరి, షన్ము ఖ, కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రజాక్షేత్రంలోనే వైసీపీ వైఫల్యాలను

ఎత్తిచూపుదాం : గుండుమల

మడకశిరటౌన: ‘గడప గడపనూ తొక్కుదాం. ప్రజాక్షేత్రంలోనే వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడదాం’అని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివారం పట్టణంలోని బాలాజీ నగర్‌ టీడీపీ కార్యాలయంలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం పోస్టర్‌ విడుదల చేశారు. అనంతరం నాయకులు, కార్యకర్తలతో సమావేశమై ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అరాచకం పెరిగి పోయిందని, రాష్ట్రానికి ఇదేం ఖర్మరా బాబూ అంటూ ప్రజలు ఆవేద న వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ అరాచక, అవినీతి, దోపిడీలను ప్రజల్లోనే ఎండగడుతూ ముందుకు సాగాలని కార్యకర్తలకు ది శా నిర్దేశం చేశారు. అందుకోసం సైనికుల్లా పనిచేద్దామని పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో కి రావడమే లక్ష్యమన్నారు. కార్యక్రమంలో బీసీసెల్‌ జిల్లా అధికార ప్రతినిధి నాగరాజు, మండల కన్వీనర్‌ లక్ష్మీనారాయణ, కౌన్సిలర్‌ ఉ మాశంకర్‌, నియోజకవర్గ ప్రధానకార్యదర్శి నరేష్‌ కన్నా, నాయీబ్రాహ్మణ సాధికార సంఘం అధ్యక్షుడు రామాంజనేయులు, మార్కెట్‌యార్డు మాజీ చైర్మన రఘురాం, కృష్ణమూర్తి పాల్గొన్నారు.

కార్యకర్తలకు శిక్షణ

రొళ్ల: స్థానిక శివాలయం ఆవరణలో శనివారం టీడీపీ ఆధ్వర్యం లో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమ నిర్వహణపై నాయకులు, కార్యకర్తలకు ఒక్కరోజు శిక్షణ ఇచ్చారు. ఈసందర్భంగా మండల క న్వీనర్‌ దాసిరెడ్డి మాట్లాడారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో అభివృద్ది శూన్యమన్నారు. మూడేళ్లు గడిచినా ఒక ఇల్లు ఇ చ్చిన దాఖలాలు లేవని, రాష్ట్రానికి ఇదేం ఖర్మ అని ప్రజలు వాపో తున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో మండల కన్వీనర్‌ దాసిరెడ్డి, ప్ర ధాన కార్యదర్శి జీకే ఈరన్న, తెలుగు యువత అధ్యక్షుడు బాలకృష్ణ, రామకృష్ణ, గురుమూర్తి, సిద్దగంగప్ప, నాగరాజు, మారుతి, తాలూకా యువత ఉపాధ్యక్షులు నాగేంద్ర, భరత, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-03T23:35:39+05:30 IST