AP News: అసలు ప్రభుత్వం ఎవరి వైపు ఉంది?: వర్ల

ABN , First Publish Date - 2022-12-15T16:57:34+05:30 IST

దళితుల పట్ల ప్రభుత్వం తీరు అమానుషంగా ఉందని టీడీపీ (TDP) సీనియర్ నేత వర్ల రామయ్య (Varla Ramaiah) ఆగ్రహం వ్యక్తం చేశారు.

AP News: అసలు ప్రభుత్వం ఎవరి వైపు ఉంది?: వర్ల

అమరావతి: దళితుల పట్ల ప్రభుత్వం తీరు అమానుషంగా ఉందని టీడీపీ (TDP) సీనియర్ నేత వర్ల రామయ్య (Varla Ramaiah) ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు (MLC Anantha Babu) దళితుడిని చంపి డోర్ డెలివరీ చేస్తే.. కేసు దర్యాప్తు చేయడానికే పోలీసులు ఇష్టపడ లేదన్నారు. అనంతబాబు సచ్చీలుడని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చాక జగన్ (Jagan) అసలు స్వరూపం బయటపడిందన్నారు. ప్రభుత్వం అనంతబాబు పక్షమా? హత్యకు గురైన దళితుడి పక్షమా? అని ఆయన ప్రశ్నించారు.

Updated Date - 2022-12-15T16:57:35+05:30 IST